Loading...
Atukulu Kobbari Purnalu Recipe : నోరూరించే "అటుకుల కొబ్బరి పూర్ణాలు".. ఈ పద్ధతిలో సింపుల్​గా చేసేయచ్చు!
నోరూరించే "అటుకుల కొబ్బరి పూర్ణాలు".. ఈ పద్ధతిలో సింపుల్​గా చేసేయచ్చు!

Atukulu Kobbari Purnalu Recipe : నోరూరించే "అటుకుల కొబ్బరి పూర్ణాలు".. ఈ పద్ధతిలో సింపుల్​గా చేసేయచ్చు!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

పండుగ సమయాల్లో ఇంట్లో తీపి పూర్ణాలు చేయడం ఆనవాయితీ. కానీ కొన్నిసార్లు పూర్ణాలకు పిండి సరిగా పట్టకపోవడం, నూనెలో వేసిన వెంటనే చీలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా ఈ విధానాన్ని అనుసరిస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. రుచి కూడా అదిరిపోతుంది. ముఖ్యంగా వంటలో కొత్తగా ఉన్నవారికి కూడా ఈ రెసిపీ చాలా ఈజీగా తయారవుతుంది. అంతేకాదు, ఒకసారి చేసి పెట్టుకుంటే నాలుగు రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. మరి అందరినీ ఆకట్టుకునే ఈ ప్రత్యేకమైన పూర్ణాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

వివరాలు 

కావాల్సిన పదార్థాలు :

బియ్యప్పిండి - 1 కప్పు

మినపప్పు - ½ కప్పు

ఉప్పు - తగినంత

అటుకులు - 2 కప్పులు

బెల్లం తురుము - 2 కప్పులు

పచ్చికొబ్బరి తురుము - ½ కప్పు

జీడిపప్పు ముక్కలు - 3 టేబుల్ స్పూన్లు

యాలకుల పొడి - ¼ టీ స్పూన్

నెయ్యి - 1 టీ స్పూన్

ఆయిల్ - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

వివరాలు 

తయారీ విధానం :

ఈ రెసిపీ కోసం ముందుగా అర కప్పు మినపప్పును ఒక గిన్నెలో వేసి, సరిపడా నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. నాలుగు గంటల తర్వాత నానిన మినపప్పును మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు జతచేస్తూ మెత్తని పిండిలా గ్రైండ్ చేయాలి.

ఇక మరో మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు బియ్యప్పిండి వేసి, అవసరమైనంత నీళ్లు పోసుకుంటూ ముద్దలు లేకుండా బాగా కలపాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేయాలి. ఆపై ముందుగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండి ఈ మిశ్రమంలో కలిపి, మళ్లీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూతపెట్టి గంటసేపు పక్కన ఉంచాలి.

ADVERTISEMENT

వివరాలు 

తయారీ విధానం :

ఇక అటుకులను ఒక కప్పులో వేసి ఐదు సార్లు శుభ్రంగా కడిగి నీరు వడగట్టేసి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత స్టవ్‌పై కడాయి పెట్టి, అందులో రెండు కప్పుల బెల్లం తురుము, మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి మరిగించాలి.

బెల్లం పూర్తిగా కరిగి జిగురు పాకం వచ్చిన తర్వాత అందులో పచ్చికొబ్బరి తురుము, కడిగి పెట్టుకున్న అటుకులు, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలుపుతూ వేయించాలి.

అనంతరం యాలకుల పొడి, నెయ్యి వేసి మరోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.

ADVERTISEMENT

వివరాలు 

తయారీ విధానం :

ఇప్పుడు మరో కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేయాలి.

నూనె బాగా వేడయ్యాక ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం ముద్దలను బియ్యంమినప్పిండి మిశ్రమంలో ముంచి నూనెలో జాగ్రత్తగా వేయాలి. మొదట మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి పూర్ణాలు లైట్ గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి.

ఆ తర్వాత మంటను కొద్దిగా పెంచి గోల్డెన్ కలర్ వచ్చాక బయటకు తీసుకోవాలి.

అంతే! నోరూరించే అటుకుల కొబ్బరి పూర్ణాలు సిద్ధం. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్‌టైట్ డబ్బాలో నిల్వ ఉంచితే నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటాయి.

ADVERTISEMENT