Loading...
Putin 150 Years Life Goal: మరణాన్ని జయించేందుకు పుతిన్ ప్లాన్? కోతుల రక్తం సేకరిస్తున్న రష్యా!
మరణాన్ని జయించేందుకు పుతిన్ ప్లాన్? కోతుల రక్తం సేకరిస్తున్న రష్యా!

Putin 150 Years Life Goal: మరణాన్ని జయించేందుకు పుతిన్ ప్లాన్? కోతుల రక్తం సేకరిస్తున్న రష్యా!

వ్రాసిన వారు Balachander Sharma
Nov 12, 2026
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనిషి జీవితకాలం ఎంత? సాధారణంగా 70 నుంచి 80 ఏళ్లు. ఆరోగ్యంగా ఉంటే మరికొన్నేళ్లు ఎక్కువగా జీవించవచ్చు. కానీ ఏకంగా 150 ఏళ్లు బతకాలంటే? ఇదే లక్ష్యంతో రష్యాలో ఆసక్తికరమైన పరిశోధనలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా దీర్ఘాయుష్షుపై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో కోతుల రక్త నమూనాలతో ప్రత్యేక పరిశోధనకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. వృద్ధాప్యం ఎలా వస్తుంది? శరీరంలోని అవయవాలు ఎప్పుడు బలహీనపడతాయి? అనే అంశాలపై అధ్యయనం చేస్తున్నారు.

Details

7 వేల కోతులు.. 22 రకాల జాతులపై పరిశోధన

పుతిన్‌కు సన్నిహితుడిగా పేరున్న మిఖాయిల్ కోవల్చుక్ నేతృత్వంలోని కుర్చటోవ్ ఇన్‌స్టిట్యూట్, పెట్రోవ్‌స్కీ రష్యన్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ సర్జరీతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఏజెంట్‌స్ట్వో అనే స్వతంత్ర మీడియా సంస్థ వెల్లడించింది.

ఈ సంస్థ వద్ద 22 జాతులకు చెందిన 7,000కు పైగా కోతులు ఉన్నాయి. వీటిలో 18 నుంచి 30 ఏళ్ల వయసున్న కోతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

వాటి రక్తనాళాలు, మెదడు, ఇతర అవయవాల పనితీరును పరిశీలిస్తున్నారు.

Details

వృద్ధాప్యాన్ని అర్థం చేసుకునేందుకు పరీక్షలు

వృద్ధ కోతులపై రక్త పరీక్షలు, జీవరసాయన విశ్లేషణలు, రక్తనాళాల పరిశీలన, మెదడు స్కానింగ్ వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

వీటి ద్వారా వయసు పెరిగే కొద్దీ శరీరంలో వచ్చే మార్పులను గుర్తించాలనేది పరిశోధకుల ఆలోచన.

ఈ వివరాలతో భవిష్యత్తులో మనుషుల జీవితకాలాన్ని పెంచే వైద్య విధానాలకు మార్గం సుగమం కావచ్చని భావిస్తున్నారు.

ADVERTISEMENT

Details

పుతిన్ మాటల్లోనూ దీర్ఘాయుష్షు ప్రస్తావన!

ప్రస్తుతం 74 ఏళ్ల వయసున్న పుతిన్ 150 ఏళ్లు జీవించాలనే ఆకాంక్షను వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

2025లో జరిగిన ఓ పర్యటన సందర్భంగా ఆయన దీర్ఘాయుష్షు, బయోటెక్నాలజీ, అవయవ మార్పిడి ద్వారా జీవితకాలాన్ని పెంచే అవకాశాల గురించి మాట్లాడిన సంభాషణ మైక్‌లో రికార్డయినట్లు కథనాలు పేర్కొన్నాయి.

మరోవైపు పుతిన్ కుమార్తె మరియా వోరోంట్సోవా కూడా వృద్ధాప్యాన్ని ఎదుర్కొనే మందుల అభివృద్ధిపై రష్యా టీవీలో మాట్లాడారు.

ADVERTISEMENT

Details

మరణాన్ని జయించడం సాధ్యమేనా?

వృద్ధాప్యాన్ని పూర్తిగా ఆపడం, మరణాన్ని జయించడం ఇప్పటికీ వైద్యశాస్త్రానికి సాధ్యం కాలేదు.

అయితే వయసుతో వచ్చే అనారోగ్యాలను తగ్గించి ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించే మార్గాలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

రష్యా ప్రయోగాలు కూడా ఇదే దిశలో మరో ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. అయితే కోతులపై జరుగుతున్న ఈ పరిశోధనలు పుతిన్ వ్యక్తిగత జీవితకాలాన్ని పెంచుతాయనేందుకు ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవు.

ADVERTISEMENT