కడుపు నొప్పా? అయితే ఈ వంటింటి చిట్కాలతో తగ్గించుకోండి
కడుపు నొప్పి రావడం అనేది సర్వసాధారణం. కడుపు నొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. కడుపు నొప్పుల్లో అనేక రకాలు ఉంటాయి. అందులో చాలావరకు తీవ్రమైనవి కావు. సులువుగా మన వంటింటి చిట్కాలతో తగ్గే కడుపు నొప్పులకు కూడా నానా హైరానా పడిపోతుంటాం. వంటగది చిట్కాలతో కడుపు నొప్పిని ఎలా తగ్గించుకోవచ్చో ఒకసారి తెలుసుకుందాం. అల్లం: అల్లం కడుపు నొప్పి చికిత్సకు బాగా పనిచేస్తుంది. ఇందులో బలమైన యాంటియాక్సిడెంట్లు ఉంటాయి. కడుపు నొప్పులను నయం చేసే చాలా మాత్రల్లో అల్లాన్ని మూల వస్తువుగా ఉపయోగిస్తుంటారు. అల్లం కషాయం తాగడం లేదా, అల్లం, లవంగాలను కలిపి చేయడం ద్వారా వచ్చే టీని తాగడం వల్ల కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చు.
వంట సోడా, ఆపిల్ సైడర్ వెనిగర్ ప్రయోజనాలు
ఆపిల్ సైడర్ వెనిగర్: కడుపు నొప్పి, వికారం, ఉబ్బసం, రిఫ్లక్స్‌తో బాధపడుతున్న వారికి ఆపిల్ సైడర్ వెనిగర్ మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది పొట్ట పీహెచ్ స్థాయిలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఒక కప్పు నీటిలో కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్‌ను కొద్దిగా తేనెతో కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. వంట సోడా: ఈనో, డైజిన్‌తో పాటు యాంటాసిడ్‌లలో ప్రధాన పదార్ధంగా వినియోంగించే బేకింగ్ సోడా కడుపు నొప్పి చికిత్సకు ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీటిలో 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి తాగాలి. బేకింగ్ సోడా ఆల్కలీన్ స్వభావాన్ని కలిగి ఉన్నందున ఇది మీ పొట్టలోని పీహెచ్ స్థాయిను పునరుద్ధరిస్తుంది.
పుదీనా ఆకుల్లో పుష్కలంగా రోగనిరోధక లక్షణాలు
పుదీనా ఆకులు పుదీనా ఆకుల్లో రోగనిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వికారం, కడుపు నొప్పిని అరికట్టగల అద్భుతమైన వంటింటి వస్తువు ఇది. ఇది కడుపు నొప్పులను దూరం చేసే గొప్ప నొప్పి నివారిణి అని నమ్ముతారు. పుదీనా ఆకుల రసాన్ని తాగడం, ఆకులను నమలడం ద్వారా, పుదీనా ఆకులతో చేసిన టీని తాగడం ద్వారా కడుపునొప్పిని నివారించుకోవచ్చు. కలబంద రసం కలబంద రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కడుపు నొప్పి, అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్, పొట్టలో పుండ్లు, ఉబ్బసం వంటివి నయం చేస్తాయి. అలాగే మలబద్ధకం కూడా తగ్గుతుంది. కలబంద జ్యూస్‌ని తాగడం వల్ల కడుపులో ఉన్న అల్సర్‌లు నయమవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.