NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / అమూల్ బ్రాండ్ లోగో గర్ల్ ఇమేజ్ సృష్టికర్త సిల్వస్టర్ డాకన్హా విశేషాలు 
    తదుపరి వార్తా కథనం
    అమూల్ బ్రాండ్ లోగో గర్ల్ ఇమేజ్ సృష్టికర్త సిల్వస్టర్ డాకన్హా విశేషాలు 
    అమూల్ లోగో సృష్టికర్త సిల్వస్టర్ డాకన్హా

    అమూల్ బ్రాండ్ లోగో గర్ల్ ఇమేజ్ సృష్టికర్త సిల్వస్టర్ డాకన్హా విశేషాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 22, 2023
    06:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రఖ్యాత పాల బ్రాండ్ అమూల్ మిల్క్ గురించి అందరికీ తెలుసు. అమూల్ పాలు గుర్తు రాగానే ఆ ప్యాకెట్ మీద ఉండే లోగో గుర్తుకొస్తుంది.

    బట్టర్ పూసిన బ్రెడ్ ని చేతిలో పట్టుకున్న పాపాయి బొమ్మతో ఉన్న అమూల్ లోగోఎంత పాపులరో చెప్పాల్సిన పనిలేదు. ఈ లోగో సృష్టికర్త పేరు సిల్వస్టర్ డాకన్హా. 1960ప్రాంతంలో ఈ లోగోను సృష్టించారు.

    అయితే ఈ నెల 20వ తేదీన ముంబైలో డాకన్హా కన్నుమూసారు. ఈ విషయాన్ని గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది.

    80ఏళ్ళ వయసులో డాకన్హా కన్నుమూసారు. ప్రస్తుతం డాకన్హా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి ఆయన కుమారుడు రాహుల్ డాకన్హా అధిపతిగా ఉన్నారు.

    Details

    పాపాయి బొమ్మతో కార్టూన్లు

    అమూల్ కోసం లోగో క్రియేట్ చేసేందుకు జరిగిన ఇంటర్వ్యూలో, కిచెన్ లోకి ఒక చిన్నపాప పరుగెడుతుందనే ఐడియాను డాకన్హ ఇచ్చారట. దాన్ని డెవలప్ చేసి లోగో క్రియేట్ చేసారు.

    అమూల్ గర్ల్ లోగోతో అనేక రకాల కార్టూన్లు తయారు చేసేవారు. ఈ కార్టూన్లు సెటైరికల్ గా, ఫన్నీగా ఉండేవి. ఇప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై కార్టూన్లు వస్తుంటాయి.

    అయితే డాకన్హా తయారు చేసిన కొన్ని అమూల్ యాడ్స్, వివాదాలకు దారితీసాయి. 1969లో హరే రామ హరే కృష్ణ మూమెంట్ సమయంలో వచ్చిన హర్రీ అమూల్ హర్రీ మమ్మీ, 1970లో నక్సలైట్ ఉద్యమంలో వచ్చిన బ్రెడ్ వితౌట్ బట్టర్, ఛోల్బేన అనే యాడ్ వివాదాలకు తెరలేపాయి. ఆ తర్వాత వీటిని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి

    తాజా

    Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో యువ నటుడు మృతి బాలీవుడ్
    Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్‌, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు డిస్నీ
    Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్! ప్రభాస్
    PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోదీ పర్యటన.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన నరేంద్ర మోదీ

    జీవనశైలి

    వరల్డ్ లూపస్ డే: రోగనిరోధక శక్తి కారణంగా వచ్చే ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ తెలుసుకోండి  లైఫ్-స్టైల్
    మదర్స్ డే రోజున అమ్మకు దూరంగా ఉన్నారా? ఫర్లేదు, ఈ విధంగా సెలెబ్రేట్ చేసుకోండి  బంధం
    బ్రైడ్ టు బి పార్టీని ఎలా ప్లాన్ చేయాలో తెలియకపోతే ఈ ఐడియాలు చూడండి  లైఫ్-స్టైల్
    వేసవిలో అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు  పర్యాటకం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025