NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / సంక్రాంతి: కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకునే ముక్కనుమ గురించి తెలుసుకోండి
    తదుపరి వార్తా కథనం
    సంక్రాంతి: కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకునే ముక్కనుమ గురించి తెలుసుకోండి
    మూడవ రోజు కనుమ, నాలుగవ రోజు ముక్కనుమ గురించి తెలుసుకోండి

    సంక్రాంతి: కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకునే ముక్కనుమ గురించి తెలుసుకోండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 13, 2023
    04:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది. కొన్నిచోట్ల భోగి, సంక్రాంతి, కనుమ అని మూడురోజులు జరుపుకుంటే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ముక్కనుమ అని నాలుగవ రోజు కూడా జరుపుకుంటారు.

    కనుమ రోజు వ్యవసాయ దారులు తమకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే పశువులను బాగా అలంకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కోడిపందాలు కూడా నిర్వహిస్తారు. కానీ జంతుహింస సరికాదని ప్రభుత్వాలు వీటిని నిషేధించాయి.

    కనుమ రోజున మినుము తినాలని దానిలోని ఐరన్ శరీరానికి మేలు చేస్తుందని అంటారు.

    ఇక కనుమ రోజున వివిధ పని ముట్లతో పనిచేసేవారు, రైతులు వారి వ్యవసాయ పనిముట్లకు కనుమ రోజున కడిగి శుభ్రం చేసుకుని, పూజలు చేస్తారు.

    సంక్రాంతి

    సంక్రాంతి సంబరాల్లో ముక్కనుమ రోజు ఏం చేస్తారంటే

    భోగి, సంక్రాంతి రోజుల్లో మాంసాహారం ముట్టుకోరు. తర్వాతి రోజైనా కనుమ, ముక్కనుమ రోజుల్లో ఎవరికి నచ్చిన మాంసాహారాన్ని వాళ్ళు భుజిస్తారు. నిజానికి కనుమ రోజు కూడా మాంసాహారాన్ని ముట్టుకోవద్దని కొంతమంది పండుతులు చెబుతున్నారు.

    ముక్కనుమతో సంక్రాంతి పండగ ముగుస్తుంది. ఈరోజున గ్రామదేవతలకు పసుపు కుంకుమ ఇచ్చి పూజలు చేస్తారు.

    అందువల్ల మాంసాహారాన్ని ఇష్టపడేవాళ్ళు తమకు ఇష్టమైన వంటకాలను చేసుకుని తింటారు. అందుకే ముక్కల కనుమ, ముక్కనుమ అన్న పేరు వచ్చిందని కొందరి అభిప్రాయం.

    ముక్కనుమ రోజు వాకిట్లో రథం ముగ్గు వేస్తారు. దాన్ని పక్కింటి వారి వాకిట్లో రథం ముగ్గుతో కలిపేస్తూ ఊరు మొత్తాన్ని కలిపేస్తారు. సూర్యుడు ఉత్తరాయణం వైపు కదిలే గమనాన్ని గుర్తు చేస్తూ ఇలా రథంతో స్వాగతం పలుకుతారని చెబుతారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సంక్రాంతి

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    సంక్రాంతి

    సంక్రాంతి సంబరం: పాలతో తయారయ్యే నోరూరించే తీపి పదార్థాలు, మీకోసమే వంటగది
    సంక్రాంతి పండగ: మొదటి రోజు భోగి పండుగను జరుపుకునే విధానాలు పండగ
    సంక్రాంతి: పండగ విశిష్టత, ప్రాముఖ్యత, జరుపుకునే విధానాలు పండగ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025