NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / సంక్రాంతి సంబరం: పాలతో తయారయ్యే నోరూరించే తీపి పదార్థాలు, మీకోసమే
    తదుపరి వార్తా కథనం
    సంక్రాంతి సంబరం: పాలతో తయారయ్యే నోరూరించే తీపి పదార్థాలు, మీకోసమే
    పాలతో తయారయ్యే తీపి పదార్థాలు

    సంక్రాంతి సంబరం: పాలతో తయారయ్యే నోరూరించే తీపి పదార్థాలు, మీకోసమే

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 11, 2023
    12:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలే తెచ్చిందే తుమ్మెదా అని పాడుకోవాల్సిన సమయం వచ్చేసింది. తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి సంబరం ముందుగానే వచ్చింది.

    సంక్రాంతికి పిండి వంటలు, తీపి పదార్థాలు చేసుకుంటాం. అందులో వెరైటీలు ప్రయత్నించాలనుకునే వారు పాలతో తయారయ్యే ఈ రెసిపీస్ చూడండి.

    ఆపిల్ పాలు: వినడానికి వింతగా ఉన్నా కూడా దీన్ని తయారు చేయడం చాలా ఈజీ. ఒక పాత్రలో పాలను తీసుకుని అవి సగం అయ్యేవరకు వాటిని మరిగించాలి. కొంచెం చక్కెర వేసి తక్కువ మంట మీద ఉంచాలి.

    ఈ టైమ్ లో రెండు ఆపిల్స్ తీసుకుని వాటిని బాగా తరిగి మరుగుతున్న పాలలో వేయాలి. 5నిమిషాలు అలాగే ఉంచి, ఏలకులు, పిస్తా, బాదం అందులో వేసి అందరికీ అందించండి.

    పాలతో తయారయ్యే తీపి పదార్థాలు

    పాలతో తయారయ్యే మరిన్ని వెరైటీలు

    పాల పోహ: కొన్ని అటుకులను నీళ్ళలో నానబెట్టాలి. ఆ తర్వాత వడబోసుకుని నీళ్ళను వంచేసి అటుకులను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాత్రలో పాలు, బిర్యానీ ఆకు, ఏలకులను మరిగించాలి.

    తడిగా ఉన్న అటుకులను పాలల్లో వేయాలి. కాసేపయ్యాక బెల్లం, చక్కెర వేసి కలపాలి. చివరగా డ్రై ఫ్రూట్స్ వేసి మీకు నచ్చిన వారికి వడ్డించండి.

    పాయసం: మరుగుతున్న పాలలో కొంచెం బియ్యం పిండిని వేయాలి. ఆ మిశ్రమం ముద్దలుగా కాకుండా కలుపుతూ ఉండాలి. కావాల్సినంత తీపి కోసం చక్కెరను కలుపుకుని మరిగించాలి.

    గట్టి మిశ్రమంలా మారిన తర్వాత స్టవ్ మీద నుండి కిందకు దించి ఏలకులను నలగ గొట్టి ఆ మిశ్రమం మీద జల్లాలి. ఆ తర్వాత అందరికీ సర్వ్ చేయండి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వంటగది

    తాజా

    Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు అయోధ్య
    Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు
    Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది! రానా దగ్గుబాటి
    Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు! ఆపరేషన్‌ సిందూర్‌

    వంటగది

    కిచెన్: రాగి ముద్ద నుండి రాగిదోశ వరకు రాగులతో తయారయ్యే వంటకాల రెసిపీస్ బరువు తగ్గడం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025