
Good Friday: గుడ్ ఫ్రైడే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవిగో..
ఈ వార్తాకథనం ఏంటి
యేసు క్రీస్తు శిలువ వేయబడ్డ దినాన్ని స్మరించుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదర సోదరీమణులు గుడ్ ఫ్రైడేను గంభీరతతో నిర్వహిస్తున్నారు.
ఆ రోజు విషాదాన్ని ప్రతిబింబించేలా నలుపు దుస్తులు ధరించి, ఈ శుక్రవారాన్ని సంతాప దినంగా భావిస్తారు.
గుడ్ ఫ్రైడే తేదీ ఎలా నిర్ణయిస్తారు?
గుడ్ ఫ్రైడే తేదీని నిర్ణయించడంలో చంద్రమానం కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రతి సంవత్సరం మార్చి 20 నుండి ఏప్రిల్ 23 మధ్యలో ఈ పవిత్ర దినం వస్తుంది. రోమన్ పాలకులు యేసును శిలువ వేసిన రోజులేనిది గుడ్ ఫ్రైడే.
వివరాలు
పాపాల విమోచనకై-యేసు బలిదానం
యేసు తనను తానే బలిగా సమర్పించుకున్నారని, ఆయన ప్రాణత్యాగం ద్వారా మానవాళి పాపాలకు విమోచనం కలిగిందని క్రైస్తవులు విశ్వసిస్తారు.
ఈ నేపథ్యంలో, గుడ్ ఫ్రైడేకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం:
గుడ్ ఫ్రైడే సంబంధిత ఆసక్తికర విషయాలు:
1. ఉపవాస దీక్షలు ప్రారంభం
గుడ్ ఫ్రైడేకు దాదాపు 40 రోజులు ముందు నుంచే క్రైస్తవులు ప్రత్యేక ఆచారాలు ప్రారంభిస్తారు. ఇందులో ఉపవాసాలు చేయడం, ప్రార్థనలకు ఎక్కువ సమయం కేటాయించడం వంటి ఆచరణలు ఉంటాయి.
వివరాలు
గుడ్ ఫ్రైడే సంబంధిత ఆసక్తికర విషయాలు:
2. యేసు పలికిన చివరి మాటలు
ఈ పవిత్ర దినంలో యేసు శిలువపై పలికిన చివరి ఏడూ మాటలను ప్రార్థన సమయంలో గుర్తు చేసుకుంటారు.
3. మధ్యాహ్నం ప్రత్యేక ఆరాధన సమయం
మధ్యాహ్నం 12 గంటల నుండి మూడువరకు - యేసును శిలువ వేసిన సమయంగా భావించి - ప్రార్థనలతో కాలం గడుపుతారు. ఈ సమయంలో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి.
4. చర్చిలో మౌనం, గంభీరత
ఆరోజున చర్చిలో గంటలు మోగించరు. శుభాకాంక్షలు చెప్పుకోరు. చిరునవ్వులు కనపడవు. తీపి రొట్టెలు ప్రసాదంగా పంచడం ఓ సంప్రదాయం.
వివరాలు
గుడ్ ఫ్రైడే సంబంధిత ఆసక్తికర విషయాలు:
5. కాపీబరాస్ — అనుబంధ సంప్రదాయం
దక్షిణ అమెరికాలో కనిపించే పెద్ద ఎలుక జాతి జలచరాలు అయిన కాపీబరాస్‌ను కొందరు చేపలుగా పరిగణించి గుడ్ ఫ్రైడే రోజు ఆహారంగా తీసుకుంటారు.
6. హాట్ క్రాస్ బన్స్
పాశ్చాత్య దేశాల్లో ఈ రోజున ప్రత్యేకంగా హాట్ క్రాస్ బన్స్ తయారు చేస్తారు. ఇవి అదృష్టాన్ని తెస్తాయని నమ్మకం ఉంది. ఇవి చెడిపోవని, ఇంటిని అగ్నిప్రమాదాల నుంచి రక్షిస్తాయని కూడా అంటారు.
7. జుట్టు కత్తిరింపు నమ్మకం
కొన్ని దేశాల్లో గుడ్ ఫ్రైడే నాడు జుట్టు కత్తిరించుకుంటే ఏడాది పొడవునా తలనొప్పి రాదని నమ్మకం ఉంది.
వివరాలు
గుడ్ ఫ్రైడే సంబంధిత ఆసక్తికర విషయాలు:
8. జమైకాలో గుడ్డు ఆచారం
జమైకాలో, సూర్యోదయానికి ముందు గుడ్డును పగలగొట్టి, గ్లాసులోని నీటిలో తెల్ల భాగాన్ని మాత్రమే కలిపి ఉంచడం ఓ సంప్రదాయం. ఇది అమెరికాలో గుడ్లకు రంగులు వేసే సంప్రదాయాన్ని పోలి ఉంటుంది.
9. జర్మనీలో నాట్యం నిషేధం
జర్మనీలో గుడ్ ఫ్రైడేను సంతాప శుక్రవారం (mourning Friday)గా ప్రకటించి, నాట్య ప్రదర్శనలను నిషేధిస్తారు. క్లబ్బులు మూసివేయబడతాయి. ఆ రోజు నాట్యం చేయడం నేరంగా పరిగణించబడుతుంది.
10. న్యూజిలాండ్‌లో ప్రసార నియంత్రణ చట్టం
గుడ్ ఫ్రైడే సందర్భంగా న్యూజిలాండ్‌లో ప్రత్యేక ప్రసార చట్టం అమలులో ఉంది. ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు టీవీ, రేడియోల్లో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయరాదు.
వివరాలు
గుడ్ ఫ్రైడే సంబంధిత ఆసక్తికర విషయాలు:
11. గుడ్ ఫ్రైడేకు వివిధ పేర్లు
ప్రపంచవ్యాప్తంగా ఈ దినానికి వివిధ పేర్లు ఉన్నాయి: ఈస్టర్ ఫ్రైడే, హోలీ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే, సైలెంట్ ఫ్రైడే వంటివి.
12. 33 సార్లు చర్చి గంటలు
కొన్ని ప్రాంతాల్లో గుడ్ ఫ్రైడే రోజున చర్చిల్లో 33 సార్లు గంటలు మోగిస్తారు. ఇది యేసు భూమిపై గడిపిన 33 సంవత్సరాలను గుర్తు చేసుకునే ఆచారం.