NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / క్యాన్సర్ ని తరిమికొట్టే క్యాబేజీ రకం కూరగాయ గురించి తెలుసుకోండి
    తదుపరి వార్తా కథనం
    క్యాన్సర్ ని తరిమికొట్టే క్యాబేజీ రకం కూరగాయ గురించి తెలుసుకోండి
    క్యాన్సర్ ని తరిమికొట్టే బ్రస్సెల్స్ మొలకలు

    క్యాన్సర్ ని తరిమికొట్టే క్యాబేజీ రకం కూరగాయ గురించి తెలుసుకోండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Dec 28, 2022
    04:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, బోక్ చోయ్, బ్రస్సెల్ మొలకలు మొదలగు ఒకే రకానికి చెందిన ఆహారాలు క్యాన్సర్ రాకుండా అరికట్టడంలో సాయపడతాయి. అవును.. వీటిల్లో క్యాన్సర్ ని అరికట్టే పోషకాలు ఉన్నాయి.

    కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్, ఫోలేట్, విటమిన్ సి, ఈ, కె ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఫైబర్ చాలా మేలు చేస్తుంది. దీనివల్ల ఆహారం ఎక్కువగా తినకుండా ఉంటారు.

    అంతేకాదు ఇందులో ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. దీనివల్ల శరీరంలో వాపులు, నొప్పులు తగ్గుతాయి. అలాగే క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా ఉంటాయి.

    ఐతే పైన చెప్పుకున్న కూరగాయల్లో ప్రత్యేకంగా బ్రస్సెల్ మొలకల గురించి చెప్పుకోవాలి. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం ఇవి క్యాన్సర్ ని అడ్డుకుంటాయి.

    క్యాన్సర్

    క్యాన్సర్ అడ్డుకునే బ్రస్సెల్స్ మొలకలు

    రోజువారి ఆహార దినచర్య సరిగ్గా లేకపోవడం, పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోకపోవడం వల్ల శరీరంలోని కణాల్లో మార్పులు వస్తాయి. ఆ మార్పులు ఒక్కోసారి కణాలకు పోషకాలను అందించి క్యాన్సర్ గడ్డలుగా మారుస్తాయి.

    అందుకే ఆహారంలో ఎలాంటి పోషకాలు తీసుకోవాలో తెలుసుకోవాలి. బ్రస్సెల్స్ మొలకల్లో ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలకు పోషకాలను అందించకుండా అడ్డుకుంటాయి.

    దానివల్ల క్యాన్సర్ గడ్డలు ఏర్పడవు. గ్లూకోసినోలేట్ అనే పదార్థం ఇందులో ఉండడం వల్ల క్యాన్సర్ కణాలను అడ్డుకుంటాయి. రొమ్ము క్యాన్సర్ ని అడ్డుకోవడంలో బ్రస్సెల్స్ మొలకలు ఉపయోగపడతాయని అధ్యయనంలో పేర్కొన్నారు.

    ఈ మొలకలు చిన్న చిన్న క్యాబేజీల్లాగా ఉంటాయి. ఇవి బెల్జియంలోని బ్రస్సెల్స్ లో బాగా ప్రసిద్ధి పొందినవి. అందువల్లే వీటికి ఆ పేరు వచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆరోగ్యకరమైన ఆహారం

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఆరోగ్యకరమైన ఆహారం

    ప్రేగులలో టొమాటోల వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు పోషకాహారాలు
    చలికాలంలో చల్లగా హిమక్రిములు లాగించేద్దాం చలికాలం
    నిత్యం యవ్వనంగా ఆరోగ్యంగా ఉండడానికి పాటించాల్సిన కొన్ని నియమాలు లైఫ్-స్టైల్
    మీ డైట్ ని మరింత ఆరోగ్యంగా మార్చే ఆయుర్వేద ఆహారాలు లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025