Dasara Navaratri 2023:నార్త్ కోల్ కతా లో చెప్పుకోదగ్గ దుర్గామాత మండపాలు, వాటి విశేషాలు
దసరా నవరాత్రి ఉత్సవాలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలా ఘనంగా జరుగుతాయి. ఆ రాష్ట్రంలోని ప్రతీ ప్రాంతంలో దుర్గామాత విగ్రహాన్ని మండపంలో ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తర కోల్ కతాలో దుర్గామాత పూజను ఘనంగా జరుపుతారు. దేవి మండపాలను కళాత్మకంగా తయారుచేస్తారు. ప్రస్తుతం ఉత్తర కోల్ కతాలో చెప్పుకోదగ్గ దేవి మండపాల గురించి మాట్లాడుకుందాం. సంతోష్ మిత్ర స్క్వేర్ సర్బోజనిన్ దుర్గోత్సవ సమితి: కోల్ కతాలో చెప్పుకోదగ్గ దుర్గాదేవి మండపాల్లో ఇదొకటి. ఈ మండపాన్ని కళాత్మకంగా తయారుచేస్తారు. ఈ సంవత్సరం అయోధ్యలోని రామ మందిరం థీమ్ ఆధారంగా ఈ మండపాన్ని తయారు చేశారు. రాముడు, హనుమంతుడు విగ్రహాలను కూడా ఈ మండపంలో ఉంచారు.
పాతూరిగట పంచేర్ పల్లి సర్బోజనిన్ దుర్గోత్సవ కమిటీ
84వ వార్షికోత్సవాన్ని ఈ మండపం జరుపుకుంటుంది. ఈ మండపాన్ని రీతుమాతి(రుతుక్రమం) అనే థీమ్ తో డిజైన్ చేశారు. దీని లక్ష్యం ఏంటంటే, రుతుక్రమం పై ఉన్న అపోహాలను తొలగించడం. శ్రీ భూమీ స్పోర్టింగ్ క్లబ్: 1969 సంవత్సరం నుండి ఈ క్లబ్ వారు దుర్గామాతను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం డిస్నీల్యాండ్ థీమ్ తో మండపాన్ని తయారు చేశారు. ఈ మండపంలో కార్టూన్ క్యారెక్టర్స్ మనకు కనిపిస్తాయి. కాలేజ్ స్క్వేర్ మండపం: 76వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్న కాలేజ్ స్క్వేర్ మండపం వారు, మైసూర్ ప్యాలెస్ థీమ్ తో మండపాన్ని తయారు చేశారు. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది.