
Ganesh Chaturthi 2023: గణేష్ చతుర్థి కోసం వినాయకుడికి సమర్పించాల్సిన 10 ప్రసాదాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
వినాయక చవితి సందర్భంగా 10 రోజుల భక్తులు గణేశుడిని పుష్పాలు, ప్రసాదాలు, మిఠాయిలతో పూజిస్తారు.
ఈ ఏడాది గణేష్ వేడుకలు సెప్టెంబర్ 18న ప్రారంభమై, సెప్టెంబర్ 28న ముగుస్తాయి. ప్రస్తుతం గణేషునికి సమర్పించాల్సిన 10 ప్రసాదాల గురించి తెలుసుకుందాం.
మోదకాలు
గణేషునికి రుచికరమైన స్వీట్‌గా దీన్ని పరిగణిస్తారు. మోదకాల పట్ల ఆయకున్న ప్రేమకు అతన్ని తరుచుగా మోదకప్రియ అని కూడా పిలుస్తారు. ఈ తీపిని మొదటి రోజున వినాయకుడికి సమర్పించడం మంచింది.
మోతీచూర్ లడ్డూ
గణేషుడికి లడ్డులంటే వీపరితమైన ఇష్టం. 10 రోజుల పండుగ సమయంలో విగ్రహానికి సమర్పించే తీపిలో మోతీచూర్ లడ్డూ కూడా ఒకటి.
Details
పోలెలు అంటే గణపతికి ప్రీతి
పోలెలు
పోలెలు అంటే గణపతికి ఇష్టమైన స్వీట్. చాలా ఇళ్లలో గణేశుడికి పోలెలు సమర్పిస్తారు. దీన్ని బెల్లం, మైదాతో చేసే ఓ తీపి పదార్థం.
శ్రీఖండ్
గింజలు, ఎండుద్రాక్ష టాపింగ్స్, వడకట్టిన పెరుగుతో తయారు చేసే భారతీయ స్వీట్. గణేష్ చతుర్థి సందర్భంగా గణేషుడికి ఇష్టమైన వంటకగా చెప్పొచ్చు.
పాయసం
బెల్లం, కొబ్బరి, యాలకలు కలిపి పాలలో అన్నం వండి దీన్ని తయారు చేస్తారు. పాయసం దక్షిణ భారత దేశంలో తయారు చేసే సంప్రదాయ స్వీట్ గా చెప్పొచ్చు.
అరటిపండు షీర
ఇది గణేషుడికి నైవేద్యంగా పెడతారు. అరటిపండ్లను సేమియా, పంచాదార ముద్దగా చేసి తయారు చేస్తారు.
Details
రవ్వ పొంగలి అనేది దక్షిణ భారతీయ చిరుతిండి
మేదు వడ
మేదు వడ దక్షిణ భారత సంప్రదాయ వడ, ఈ వడను తరుచుగా ప్రసాదాల్లో కూడా అందిస్తారు.
రవ్వ పొంగలి
రవ్వ పొంగలి అనేది దక్షిణ భారతీయ చిరుతిండి, దీన్ని నెయ్యితో తయారు చేస్తారు. ఇది రవ్వ, పెసర పప్పుతో రుచికరంగా చేసి పైన మంచి టాపింగ్స్ వేస్తారు.
కోకోనట్ రైస్
ఇది కొబ్బరి పాలలో తెల్ల బియ్యాన్ని నానబెట్టి చేసే వంటకం. గణేషుడికి అత్యంత ఇష్టపడే భోగ్ ఐటమ్ లలో ఇది ఒకటి.
సటోరి
మహారాష్ట్రలో అత్యంత ఇష్టపడే పండుగ వంటకాలలో సటోరి ఒకటి. ఇది ఖోయా లేదా కోవా, నెయ్యి, బేసన్, పాలతో తయారు చేయబడిన ఒక రుచికరమైన స్వీట్