మీకు నిద్ర సరిగా పట్టడం లేదా? 10-3-2-1-0 పద్ధతి గురించి తెలుసుకోండి
పొద్దున్నుండి సాయంత్రం వరకు పనిచేయడం ఎంత ముఖ్యమో రాత్రి నుండి పొద్దున్న వరకు నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం. అలసిపోయిన శరీరానికి నిద్ర లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ప్రస్తుతం చాలామంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే హ్యాపీగా నిద్రలోకి జారుకోవడానికి 10-3-2-1-0 పద్ధతి పనిచేస్తుందని చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం మనుషులకు నిద్ర ఎందుకు పట్టడం లేదనే విషయమై చాలామంది నిపుణులు పరిశోధనలు చేశారు. అలాగే నిద్ర పట్టడానికి కావలసిన టెక్నిక్స్ అందించారు అందులో 10-3-2-1-0 పద్దతి ఒకటి. 10గంటల ముందు కెఫిన్ కట్ చేయాలి నరాలను ఉత్తేజపరిచే గుణం కెఫిన్ కు ఉంటుంది. దీని కారణంగా మీకు నిద్ర సరిగ్గా పట్టదు. అందుకే పడుకోవడానికి 10గంటల ముందు కెఫిన్ తీసుకోకూడదు.
ఆల్కహాల్, ఆహారం చేసే నష్టం
3గంటల ముందు ఆల్కహాల్ తీసుకోకూడదు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన ఎక్కువసార్లు చేయాల్సి వస్తుంది. దీనివల్ల నిద్ర కరువవుతుంది. ఆల్కహాల్ మాత్రమే కాదు ఆహారాన్ని కూడా నిద్ర పోయే మూడు గంటల ముందే తీసుకోవాలి. లేదంటే అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. 2గంటల ముందే లాప్టాప్ మూసేయాలి పడుకునే ముందు వరకు పనిచేస్తూ కూర్చుంటే నిద్ర దూరమవుతుంది. లాప్టాప్ ముందు ఎక్కువ సేపు పనిచేయడం, రాత్రవుతున్నా కూడా పని గురించే ఆలోచించడం వలన నిద్ర సరిగ్గా పట్టక ఇబ్బంది కలుగుతుంది.
అలారంతో నిద్ర మాయం
గంట ముందు స్మార్ట్ ఫోన్ ఉపయోగించకూడదు నిద్రపోయే ముందు ఫోన్ చూడడం వల్ల అందులోని అనవసరమైన సమాచారం మీ మెదడుపై ప్రభావం చూపుతుంది. దానివల్ల నిద్రకు భంగం కలుగుతుంది. మీరు హ్యాపీగా నిద్ర పోవాలంటే నిద్రపోయే ముందు ఫోన్ అస్సలు వాడకూడదు. స్నూజ్ బటన్ నొక్కవద్దు చాలామంది పొద్దున్న తొందరగా లేవాలని అలారం పెట్టుకుంటారు, కానీ అలారం మోగిన తర్వాత స్నూజ్ చేస్తారు. దీనివల్ల మరొక పది నిమిషాల తర్వాత మళ్లీ అలారం అవుతుంది. ఇది మీ నిద్రను దూరం చేస్తుంది. పది నిమిషాల్లో అలారం మోగుతుందన్న ఫీలింగ్ మీకు నిద్ర పట్టకుండా చేస్తుంది. పైవన్నీ ఫాలో అయితే మీకు మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.