పని ఒత్తిడి మరీ ఎక్కువగా ఉందా? ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేయాల్సిన పనులు
పనిలో ఒత్తిడి చాలా సహజం. ఈ ఒత్తిడిని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. తేలికైన ఒత్తిడి వల్ల పని తొందరగా అవుతుంది, కానీ ఆ ఒత్తిడి తీవ్రమైతే పని ఆలస్యంగా జరగడంతో పాటు ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. డైట్ లో చేసుకోవాల్సిన మార్పులు ఆహారం అతిగా తినడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలైన స్వీట్స్, తీపి పదార్థాలు తినడం వల్ల రక్తంలో చెక్కర శాతం తొందరగా పెరుగుతుంది. మీ డైట్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలైన గుడ్లు, గింజలు, విత్తనాలు, తేలికపాటి మాంసాహారాలను చేర్చుకోవాలి.
చిన్న చిన్న బ్రేక్స్ వల్ల పెద్ద మార్పులు
చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలి పనిలో పడి ఆరోగ్యాన్ని మర్చిపోతే రేపు పొద్దున్న ఆరోగ్యం పాడైపోయిన తర్వాత మిమ్మల్ని అందరూ మర్చిపోతారు. పనిలో ఉన్నప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. ఆ సమయాల్లో వేగంగా నడవడం, శరీరాన్ని అటూ ఇటూ వంచడం, లేక తేలికపాటి వ్యాయామాలు చేయాలి. శ్వాసను గట్టిగా పీల్చుకోవడం, వదలడం వంటివి చేయడం వల్ల యాంగ్జాయిటీ తగ్గుతుంది. మీరు బ్రేక్ తీసుకునే సమయంలో మిమ్మల్ని ఆనందపరిచే వేరే యాక్టివిటీ చేయాలి. దీనివల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది నో చెప్పడం నేర్చుకోవాలి మీకంటూ కొన్ని పరిధులు నిర్మించుకోవాలి. ఆఫీస్ అవర్స్ తర్వాత పనికి సంబంధించిన మెయిల్స్, మెసేజెస్ చూడకూడదు. అదనపు బాధ్యతలు తీసుకోకపోతే మంచిది.
బహుమతులు చేసే మేలు
మీకు మీరే బహుమతులు ఇచ్చుకోండి పనిలో ఉన్నప్పుడు కొన్ని గోల్స్ పెట్టుకోండి. ఆ గోల్స్ పూర్తికాగానే మీకు మీరే బహుమతులు ఇచ్చుకోండి. దీనివల్ల మీలో ఒక రకమైన ఉత్సాహం కలుగుతుంది. కాఫీ తాగడం, మూవీకి వెళ్లడం లాంటి బహుమతులు ఇచ్చుకుంటే బాగుంటుంది. పనిలోకి వెళ్లే ముందు ప్రశాంతంగా ఉండాలి చాలామంది కంగారు కంగారుగా ఆఫీసుకు వెళ్తారు. పిల్లల్ని స్కూల్లో దింపి, ట్రాఫిక్ లో అడ్డదిడ్డంగా బైక్ ని నడుపుతూ, బ్రేక్ ఫాస్ట్ చేయకుండా కాఫీ మాత్రమే తాగి ఆఫీస్ కి వెళ్తారు. దీనివల్ల ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. అందుకే మంచి పోషణ కలిగిన ఆహారాలను తీసుకోవాలి. ఆఫీసు సమయం కంటే ఐదు నిమిషాల ముందుగా ఆఫీసుకు చేరుకోవడం మంచిది.