LOADING...
America: ట్రంప్‌ నివాసంలోకి సాయుధ దుండగుడి చొరబాటు.. కాల్చిచంపిన భద్రతా సిబ్బంది
ట్రంప్‌ నివాసంలోకి సాయుధ దుండగుడి చొరబాటు.. కాల్చిచంపిన భద్రతా సిబ్బంది

America: ట్రంప్‌ నివాసంలోకి సాయుధ దుండగుడి చొరబాటు.. కాల్చిచంపిన భద్రతా సిబ్బంది

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2026
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలోకి ఒక సాయుధ వ్యక్తి చొరబడ్డ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అప్రమత్తంగా వ్యవహరించిన భద్రతా సిబ్బంది అతడిపై కాల్పులు జరిపి మట్టుబెట్టారు. ఈ సంఘటన ఫ్లోరిడాలోని పామ్ బీచ్ ప్రాంతంలో ఉన్న ట్రంప్ నివాసం 'మార్-ఎ-లాగో' రిసార్ట్‌లో శనివారం అర్ధరాత్రి అనంతరం, ఆదివారం తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో జరిగింది. ఆ సమయానికి ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ అక్కడ లేరు. వారు వాషింగ్టన్‌లోని శ్వేతసౌధంలో ఉన్నారని అధికారులు తెలిపారు.

వివరాలు 

మృతుడు ఉత్తర కరోలినాకు చెందిన ఆస్టిన్ టకర్ మార్టిన్

మృతుడిని ఉత్తర కరోలినాకు చెందిన 21 ఏళ్ల ఆస్టిన్ టకర్ మార్టిన్‌గా గుర్తించారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మీ వెల్లడించిన వివరాల ప్రకారం,మార్-ఎ-లాగో ఉత్తర ద్వారం వద్ద నుంచి ఒక వాహనం బయటకు వెళ్తున్న సమయంలో,అనుమానితుడు తన కారును అకస్మాత్తుగా లోపలికి దూసుకొచ్చాడు. అక్కడ విధుల్లో ఉన్న ఇద్దరు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు,ఒక పోలీసు అధికారి వెంటనే అతడిని అడ్డుకున్నారు.

వివరాలు 

ఆస్టిన్ టకర్ మార్టిన్ మానసిక పరిస్థితి ఏమిటి?

అతడి వద్ద గ్యాస్ క్యాన్, షాట్‌గన్ ఉన్నట్లు గుర్తించిన భద్రతా సిబ్బంది వాటిని నేలపై పడేయాలని ఆదేశించారు. అతడు గ్యాస్ క్యాన్‌ను కింద ఉంచినప్పటికీ, షాట్‌గన్‌ను మాత్రం వదల్లేదు. కాల్పులకు సిద్ధమయ్యే విధంగా దాన్ని పైకి ఎత్తడంతో, భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి అతణ్ని హతమార్చారు ఆస్టిన్ టకర్ మార్టిన్ మానసిక పరిస్థితి ఏమిటి? ట్రంప్ నివాసంలోకి చొరబడటానికి అతడిని ప్రేరేపించిన కారణాలు ఏమిటి? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement