మీ మనసు ప్రశాంతంగా, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించాలి, ఎందుకో ఇక్కడ తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత ప్రపంచం పక్కనున్న వారిని కనీసం చూడ్డానికి కూడా టైం లేకుండా బిజీగా గడుపుతోంది. తలకాయలను ఫోన్లకు అతికించేసి చేతులను కీబోర్డ్ కి అప్పగించేసి మనసంతా ఒత్తిడి నింపుకుంటూ బ్రతికేస్తున్నారు.
ప్రతీక్షణం పని కోసమే బ్రతకడం వల్ల ఇంటికీ, ఇంట్లో వాళ్లకు దూరమవుతున్నారు. అయితే మీకు ఇది తెలుసా? ఇంట్లో వాళ్లతో సమయం గడిపితే మన ఆరోగ్యానికి చాలా మంచిది.
ఫ్యామిలీతో గడపడానికి సమయం సమయాన్ని కేటాయిస్తే అదెలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.
మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది
ఇంట్లో వాళ్లతో ఉన్నప్పుడు ఎమోషనల్ సపోర్ట్ దొరుకుతుంది. నాది, నా వారు అన్న ఫీలింగ్ కలుగుతుంది ఈ కారణంగా మనసులో ఉన్న భయాలు, ఒత్తిడి తగ్గిపోతాయి.
Details
ఫోన్ లు పక్కన పెట్టి ప్రపంచాన్ని చూడాలి
యాంగ్జాయిటీని తగ్గిస్తుంది
ఒంటరిగా ఉన్నామన్న భావన మనసులోకి రాకుండా ఉండాలంటే ఇంట్లో వాళ్లతో కాసేపు ప్రశాంతంగా గడపాలి. ఇంట్లో వాళ్ళతో గడిపితే యాంగ్జాయిటీ తగ్గిపోతుంది.
నైపుణ్యాలను పెంచుతుంది
చిన్నప్పటినుండి మనం ఇంట్లో వాళ్లనుండే అన్నీ నేర్చుకుంటాం. అవతలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఆత్మవిశ్వాసంతో ఎలా ఉండాలి? మొదలగు విషయాలన్నీ ఇంట్లో వాళ్లతో సమయం గడిపితే అర్థమవుతాయి.
బంధాలు బలపడతాయి
ఫోన్ల ద్వారా చూసే ప్రపంచానికి ఫోన్లు పక్కనపెట్టి మన కళ్ళతో చూసే ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా అర్థం కావాలంటే ఇంట్లో వాళ్లతో గడపాలి. ఇంట్లో వాళ్లకు టైం ఇస్తే మీ బంధం బలపడుతుంది.
Details
బిహేవియరల్ మార్పులు రాకుండా ఉండాలంటే ఫ్యామిలీతో గడపాలి
సమాజంతో కలవలేకపోతే అనేక ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా బిహేవియర్ లో చాలా మార్పులు వస్తాయి. ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థం కాదు. ఈ సమస్య చిన్నప్పటి నుండి ఉన్నట్లయితే పెద్దయ్యాక తీవ్ర సమస్యగా మారుతుంది.
అందుకే పిల్లలను ఒంటరిగా ఉండనివ్వకుండా వాళ్లతో రోజూ కొంత సమయం గడపాలి. దానివల్ల పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ తో పాటు మీకూ, వారికీ మధ్య బంధం బలపడుతుంది.