
యాంగ్జాయిటీని పెంచే ఈ ఆహారాలను అస్సలు ముట్టుకోవద్దు
ఈ వార్తాకథనం ఏంటి
మీకు యాంగ్జాయిటీ డిజార్డర్ ఉందా? కారణం లేకుండానే మీలో యాంగ్జాయిటీ పెరిగిపోతుందా? అయితే మీరు తినే ఆహారమే అలా పెరగడానికి కారణం కావచ్చు.
మనం తీసుకునే ఆహారాల్లో ఉండే పదార్థాలు యాంగ్జాయిటీని పెంచుతాయి. అందుకే ఆహారాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల యాంగ్జాయిటీ పెరుగుతుందో చూద్దాం.
టీ, కాఫీ:
ఈ ప్రపంచంలో చాలామందికి పొద్దుపొద్దున్నే టీ, కాఫీ లేనిదే తెల్లారదు. యాంగ్జాయిటీ ఉన్నవారు వీటిని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఇందులోని కెఫైన్, యాంగ్జాయిటీని విపరీతంగా పెంచుతుంది.
చాక్లెట్:
ఒత్తిడి తగ్గిస్తాయని చెప్పుకునే చాక్లెట్లు కూడా యాంగ్జాయిటీని పెంచుతాయి. అంటే చాక్లెట్లని రెగ్యులర్ గా తినడం వల్ల ఇలా జరుగుతుంది. ఎప్పుడో ఒకసారి తింటే పెద్ద సమస్యేమీ కాదు.
యాంగ్జాయిటీ
యాంగ్జాయిటీని పెంచే ఇతర ఆహారాలు
సోడా, ఎనర్జీ డ్రింక్స్, ఆల్కహాల్:
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. బాడీలో నీరు తగ్గిపోతుంది. ఆకలి ఉండదు, నిద్ర దూరమవుతుంది. వీటన్నింటి వల్ల యాంగ్జాయిటీ నిద్ర లేస్తుంది. సోడాలు, ఎనర్జీ డ్రింక్స్ లో కెఫైన్ ఉంటుంది.
ప్రాసెస్ చేసిన ఆహారాలు:
ఈ ఆహారాల్లో రిఫైన్ చేసిన చక్కెరలు, కృత్రిమ తీపి పదార్థాలు ఉంటాయి. ఇందులో ఎక్కువ ఉప్పు ఉండడం వల్ల గుండెకు పనిభారం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు యాంగ్జాయిటీని పెంచుతాయి. వైట్ బ్రెడ్, ఫ్రోజెన్ ఆహారాలు తినరాదు.
సాస్:
మనకు నచ్చిన ఆహారానికి సాస్ నంజుకుని తింటే బానే ఉంటుంది. కానీ దీనివల్ల యాంగ్జాయిటి పెర్రుగుతుంది. ఇలాంటప్పుడు సాస్ లని అప్పటికప్పుడు తయారు చేసుకుని తినడం ఉత్తమం.