ఆరోగ్యం: ఏయే ఆహారాలను ఎలా నిల్వ చేయాలో ఇక్కడ తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజు ఆహార భద్రతా దినోత్సవం. మనం తీసుకునే ఆహారం చెడిపోకుండా ఉండేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయంపై అవగాహన పెంచేందుకు, అలాగే కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల కలిగే ఇబ్బందులను తెలియజేయడానికి ఈరోజును జరుపుతారు.
ప్రస్తుతం ఏయే రకాల ఆహారాలను ఏ విధంగా నిల్వ చేయవచ్చో తెలుసుకుందాం.
పొగబెట్టడం:
మాంసాహారాలను నిల్వ చేసే ఒకరకమైన పద్దతి ఇది. బాక్టీరియాను చంపడానికి ఈ పద్దతి ఉపయోగపడుతుంది. ఈ ప్రాసెస్ లో మాంసాన్ని నిప్పుల మీద వేలాడదీస్తారు. తద్వారా తేమ తగ్గిపోతుంది.
ఎండబెట్టడం:
మామిడి, ద్రాక్ష, టమాటలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ఎండబెట్టడం అనే ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఎండబెట్టినపుడు వాటిల్లోని తేమ తగ్గిపోయి బాక్టీరియా నాశనమవుతుంది.
Details
గాలి దూరని డబ్బాల్లో నిల్వ ఉంచడం
క్యానింగ్:
ఆహారాలను నిల్వ చేయడానికి పనికొచ్చే మరో పద్దతి క్యానింగ్. ఈ ప్రాసెస్ లో జామ్, జెల్లీ, కూరగాయలను నిల్వ చేస్తారు. కొంచెం కూడా గాలి దూరని డబ్బాలలో ఆహారాలను నిల్వ చేయడాన్నే క్యానింగ్ అంటారు.
పులియబెట్టడం:
పులియబెట్టడంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రక్రియ శుభ్రంగా జరగకపోతే ఆహారం పాడైపోయే అవకాశం ఉంది. పెరుగు, వెల్లుల్లి, వైన్ వంటి వాటిని నిల్వ చేయడానికి ఈ పద్దతిని ఉపయోగిస్తారు.
ఫ్రీజింగ్:
ఆహారాలను చల్లని ఉష్ణోగ్రత వద్ద ఉంచితే అవి కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటాయి. అయితే మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం సరికాదు. ముఖ్యంగా వండిన ఆహారాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచకపోవడమే మంచిది.