
Ugadi Special recipe : ఉగాది ప్రత్యేక వంటకాలు.. సేమియా-కొబ్బరి పాయసం.. రుచికరమైన ఆంధ్ర ప్రత్యేక వంటకం
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయులలో తీపి పదార్థాలను ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. దేశవ్యాప్తంగా ప్రతి ప్రత్యేక సందర్భంలో, సంతోష సందర్భాల్లో, పండుగల సమయంలో, పూజల సమయంలో స్వీట్లు తయారు చేయడం అనివార్యం. సాదారణంగా చేసే సగ్గుబియ్యం పాయసానికి కొంత ప్రత్యేకతను జోడించి, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడే కొబ్బరి తో కొత్తరకమైన పాయసం తయారు చేసుకుందాం.
వివరాలు
కావలసిన పదార్థాలు:
సేమియా - 1 కప్పు పాలు - 1/2 లీటర్ చిక్కని కొబ్బరిపాలు - 1/2 కప్పు (పచ్చికొబ్బరి తురిమి గ్రైండ్ చేసి వడగట్టిన కొబ్బరిపాలు) పంచదార - 1 1/2 కప్పు నువ్వులు, మినపప్పు, పెసరపప్పు - 3 టేబుల్ స్పూన్లు (అన్నీ కలిపి) జీడిపప్పు పొడి - 2 టీ స్పూన్లు యాలకుల పొడి - 1 టీ స్పూన్ ద్రాక్ష, జీడిపప్పు, బాదం - 1/4 కప్పు
వివరాలు
తయారీ విధానం:
పాన్‌లో నువ్వులు,మినపప్పు,పెసరపప్పులను విడివిడిగా వేయించి,మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, జీడిపప్పు, ద్రాక్ష, బాదంను స్వల్పంగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరోసారి కొద్దిగా నెయ్యి వేసి, సేమియాను దోరగా వేయించి పెట్టుకోవాలి.గిన్నెలో పాలు మరిగించి, అందులో కొబ్బరిపాలను కలిపి మరొకసారి మరిగించాలి. చిన్న మంటపై ఉంచి, సేమియాను జత చేసి ఉడికించాలి. కొద్దిసేపటి తర్వాత పంచదార కలిపి మరిగించాలి. అరకప్పు పాలను తీసుకుని, ముందుగా సిద్ధం చేసుకున్న పొడిని అందులో కలిపి, ఈ మిశ్రమాన్ని మరిగే పాలలో పోయాలి. పదినిమిషాల తర్వాత జీడిపప్పు పొడి, యాలకుల పొడి వేసి బాగా కలిపి, చివరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష, బాదం చల్లి అందంగా అలంకరించి వడ్డించాలి.