వాలెంటైన్స్ డే: మీ ప్రియమైన వారి కోసం స్ట్రాబెర్రీ చాక్లెట్స్ ఇంట్లోనే తయారు చేయండి
స్ట్రాబెర్రీ, చాక్లెట్ ని కలిపి తింటే ఆ రుచే వేరు. ప్రేమికుల రోజున స్ట్రాబెర్రీ నిండిన చాక్లెట్లని ఇంట్లోనే తయారు చేసుకోండి. డార్క్ చాక్లెట్ స్ట్రాబెర్రీ: డబుల్ బాయిలర్ పద్దతిలో డార్క్ చాక్లెట్ ని కరిగించాలి. ఇప్పుడు స్ట్రాబెర్రీలను చాక్లెట్ లో ముంచి సిలికాన్ షీట్ మీద పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం సముద్రపు ఉప్పు, కొంచెం చాక్లెట్ సాస్ వేసి మీ ప్రియమైన వారికి అందించండి. హాజెల్ నట్ స్ట్రాబెర్రీ చాక్లెట్: ఫుడ్ ప్రాసెసర్ తీసుకుని హాజెల్ నట్స్, గోజి బెర్రీస్ మిక్స్ చేయాలి. కరిగిన చాక్లెట్, హాజెల్నట్ బటర్, మ్యాపిల్ సిరప్ వేసి కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని స్ట్రాబెర్రీల మీద వేస్తే సరిపోతుంది.
ప్రేమికుల రోజున మీ భాగస్వామికి అందించాల్సిన స్ట్రాబెర్రీ చాక్లెట్
నుటెల్లా స్ట్రాబెర్రీస్: స్ట్రాబెర్రీలను సగానికి కత్తిరించి వాటి మధ్యభాగాన్ని తీసివేయాలి. ఇప్పుడు అక్కడ ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో నుటెల్లాతో నింపాలి. ఇప్పుడు ఆ స్ట్రాబెర్రీలను కరిగిన చాక్లెట్ లో ముంచాలి. హాజెల్నట్స్ పై నుండి జల్లుకుని హాయిగా ఆరగించండి. వోడ్కా చాక్లెట్ స్ట్రాబెర్రీస్: ఒక పాత్రలో స్ట్రాబెర్రీస్ తీసుకుని అందులో కొంత వోడ్కా గుమ్మరించండి. 3గంటలు రిఫ్రిజిరేటర్లో పెట్టాక బయటకు తీసి వడబోసి ఎండేవరకు పక్కన పెట్టండి. చాక్లెట్ చిప్స్, కొబ్బరినూనె లో వేసి మైక్రోవేవ్ లో పెట్టాలి. చాక్లెట్ పూర్తిగా కరిగిపోయేవరకు అలాగే ఉంచాలి. ఇప్పుడు స్ట్రాబెర్రీలను కరిగిన చాక్లెట్ లో ముంచాలి. ఆ తర్వాత బేకింగ్ లో షీట్ ఉంచి రిఫ్రిజిరేషన్ లో ఉంచాలి. కాసేపయ్యాక హ్యాపీగా ఆరగించవచ్చు.