వాలెంటైన్స్ డే: మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ఈ రోడ్ ట్రిప్స్ వెళ్ళండి
ఈ వార్తాకథనం ఏంటి
వాలెంటైన్స్ డే బహుమతిగా మీ భాగస్వామికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే పూలు, గ్రీటింగ్ కార్డులకు బదులుగా రోడ్ ట్రిప్స్ ప్లాన్ చేయండి. మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ప్రకృతిలో పరుగెలుడుతూ, అందాన్ని ఆస్వాదిస్తూ భారతదేశ రోడ్ల మీద మీ బండిని ఎక్కించండి.
రోడ్ ట్రిప్ కి సౌకర్యంగా ఉండే రహదారులు తెలుసుకుందాం
బెంగళూరు నుండి బందిపూరి ఫారెస్ట్
217కిలోమీటర్ల దూరంగల ఈ ట్రిప్ లో ప్రకృతి అందాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అప్పుడప్పుడు అడవి జంతువులు కనిపించి అబ్బురపరుస్తాయి. దారిలో వచ్చే కంబినీ నదిలో పడవ ప్రయాణం మర్చిపోవద్దు.
చెన్నై నుండి మున్నార్
చుట్టుపక్కల కొండలు, టీ మొక్కలు, సరస్సులు, జలపాతాలు రోడ్ ట్రిప్ లో మీరు చూడొచ్చు. 592కిలోమీటర్ల ప్రయాణాన్ని కార్లో వెళ్ళడం మంచిది.
వాలెంటైన్స్ డే
మీ భాగస్వామితో వెళ్ళడానికి అనుకూలంగా ఉండే మరిన్ని రోడ్ ట్రిప్స్
డార్జిలింగ్ నుండి పెల్లింగ్
107కిలోమీటర్ల ఈ రోడ్ ట్రిప్ అద్భుతంగా ఉంటుంది. సముద్ర మట్టానికి ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ఈ రోడ్ ట్రిప్ లో కాంచనగంగ పర్వతాన్ని దర్శించవచ్చు.
జైపూర్ నుండి జైసల్మీర్
ఎడారి ప్రాంతపు రోడ్లను ఎక్స్ ప్లోర్ చేయాలనుకుంటే 500కిలోమీటర్ల ఈ రోడ్ ట్రిప్ వెళ్ళండి. ఈ ట్రిప్ లో జైసల్మీర్ కోట. గడిసర్ సరస్సు, కొన్ని హిందూ దేవాలయాలు కనిపిస్తాయి.
షిమ్లా నుండి మనాలి
తెల్లటి మంచుపర్వతాల్ని దగ్గరగా చూడాలనుకుంటే ఈ రోడ్ ట్రిప్ అద్భుతంగా ఉంటుంది. ఈ ట్రిప్ లో హిమాలయ పర్వతాలు పత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ ప్రాంతం గుండా వెళ్తూ ఎక్కడో ఓ చోట ఆగి వేడివేడి నూడిల్స్ తింటే వచ్చే మజానే వేరు.