
వినాయక చవితికి ముందు రోజు జరుపుకునే గౌరీ గణేష్ హబ్బా గురించి మీకు తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
హెడ్డింగ్ చూడగానే గౌరీ గణేష్ హబ్బా పండగ ఏంటబ్బా అనే సందేహం రావడం చాలా సహజం.
వినాయక చవితికి ముందు పండగ జరుపుకోవడం ఏంటని ఆశ్చర్యంగా కూడా ఉండవచ్చు.
గౌరీ గణేష్ హబ్బా అనేది కర్ణాటక రాష్ట్రంలో జరుపుకునే పండుగ. వినాయక చవితికి ఒకరోజు ముందు ఈ పండగను జరుపుకుంటారు.
వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో, కర్ణాటకలో జరుపుకునే గౌరీ గణేష్ హబ్బా పండగ విశేషాలు తెలుసుకుందాం.
వినాయక చవితి ముందు రోజున పార్వతి దేవిని కర్ణాటక ప్రజలు పూజిస్తారు. ఈ పండుగను గౌరీ హబ్బా అంటారు.
ఈ పండగ తర్వాత వినాయకుడిని పూజిస్తారు. కాబట్టి ఈ రెండింటిని కలిపేసి గౌరీ గణేష్ హబ్బా అని పిలుస్తారు.
Details
గౌరీ హబ్బా విశేషాలు
వినాయక చవితి ముందు రోజున పార్వతి దేవిని పూజిస్తారు.
పురాణాల ప్రకారం పార్వతి దేవి.. గౌరీ హబ్బా రోజున తన భక్తులను కలుసుకుంటుంది. ఆ మరునాడు వినాయకుడు పార్వతి దేవిని కైలాసానికి తీసుకొని వెళ్ళిపోవడానికి వస్తాడు.
గౌరీ హబ్బా పండగ రోజున పెళ్ళైన మహిళలు గౌరీ విగ్రహాన్ని అలంకరించి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తారు.
చుట్టుపక్కల వాళ్లను పిలిచి పసుపు, కుంకుమ, గాజులు, పూసలు, బ్లౌజ్ పీస్, కొబ్బరికాయ, స్వీట్, బెల్లం, మొదలగు వాటిని కలిపి అవతలి వాళ్ళకి ఇస్తారు.
ఆ తర్వాతి రోజు ఇంట్లో పూజ గదిని అలంకరించి గణపతి విగ్రహాన్ని పూజిస్తారు. ఇంకా వినాయకుడికి పాయసం, రకరకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా గౌరీ గణేష్ హబ్బా పండగను జరుపుకుంటారు.