Irani tea: ఇరానీ చాయ్ కథ ఏంటి? హైదరాబాద్‌కి ఎలా చేరింది.. రెసిపీ పూర్తి వివరాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
గ్రీన్ టీ, బ్లాక్ టీ, బెల్లం టీ, లెమన్ టీ, మసాలా టీ, జింజర్ టీ, జఫ్రానీ టీ ఇలా ఎన్నో రకాల టీలు మనకు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా వీటిలో ఎక్కువ భాగంలో టీ పొడి, పాలు, పంచదార వాడుతుంటారు. అయితే ఈ అన్నింటికంటే భిన్నంగా ఉండేది ఇరానీ చాయ్. దీన్ని వెంటనే తయారు చేసే టీలా కాకుండా కొంత సమయం కేటాయించి తయారు చేయాల్సి ఉంటుంది. టేస్ట్ మాత్రం ప్రత్యేకంగా, చిక్కగా ఉండి గొంతులోకి మృదువుగా దిగుతుంది. ఒక సిప్ తీసుకున్నాక మరో సిప్ కోసం ఆసక్తి పెంచే రుచితో ఉంటుంది. ఇరానీ టీకి ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. ఈటీ ఇరాన్ నుంచి భారతదేశానికి వచ్చినదిగా చరిత్రకారులు చెబుతున్నారు.
వివరాలు
కావల్సిన పదార్థాలు
19వ శతాబ్దంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో హైదరాబాద్‌కు చేరుకుంది. ఉస్మానియా బిస్కెట్‌తో కలిసి ఇరానీ చాయ్ తాగితే వచ్చే రుచి మరింత ప్రత్యేకంగా ఉంటుంది. టీ పొడి - 2 టేబుల్ స్పూన్లు నీళ్లు - 2 కప్పులు పంచదార - 2 టేబుల్ స్పూన్లు పాలు - అర లీటర్ యాలకులు - 3 కండెన్స్‌డ్ మిల్క్ - 2 టేబుల్ స్పూన్లు
వివరాలు
తయారీ విధానం
ముందుగా డికాషన్ తయారీ కోసం గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసి టీ పొడి వేసుకోవాలి. మధ్య మంటపై మరిగిస్తూ పంచదార వేసి కలపాలి. ఆ తర్వాత ఆవిరి బయటకు పోకుండా మూతపెట్టి సుమారు 20 నిమిషాలు మరిగించాలి. ఇక మరో పాత్రలో పాలు పోసి మరిగించాలి. యాలకులు దంచి వేసి బాగా కలుపుతూ మరిగించాలి. పాలు అడుగంటకుండా కలుపుతూ చిక్కబడే వరకు మరిగించి, ఆపై కండెన్స్‌డ్ మిల్క్ వేసి కలపాలి. తర్వాత డికాషన్‌ను మూత తీసి జల్లెడతో వడగట్టాలి. ముందుగా కప్పులో డికాషన్ పోసి, దాని మీద వేడి వేడి పాలు పోసి కలిపితే ఇరానీ టీ సిద్ధం అవుతుంది.
వివరాలు
టీ టిప్స్
డికాషన్ ఎక్కువ సేపు మరిగిస్తే రుచి మరింత పెరుగుతుంది మరిగించే సమయంలో ఆవిరి బయటకు పోకుండా దమ్ ఇవ్వాలి లీటర్ డికాషన్‌ను కనీసం అర లీటర్ అయ్యే వరకు మరిగించడం మంచిది పాలను కూడా సగానికి తగ్గే వరకు మరిగిస్తే టేస్ట్ బాగా వస్తుంది చిక్కని, ఫ్యాట్ ఎక్కువ ఉన్న పాలు వాడితే రుచి మెరుగవుతుంది ఫ్లేవర్ కోసం యాలకులు, దాల్చిన చెక్క పొడి కూడా కలుపుకోవచ్చు ఇలా ఇంట్లోనే సులభంగా ఇరానీ స్టైల్ చాయ్ తయారు చేసి ఆ ప్రత్యేక రుచిని ఆస్వాదించవచ్చు.