ఒక బంధంలో బ్రేకప్ బాధను తగ్గించడానికి ఎలాంటి విషయాలు పాటించాలో తెలుసుకోండి
ప్రేమ ఎంత బాగుంటుందో బ్రేకప్ అంత ఘోరంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నప్పుడు మేఘాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది. బ్రేకప్ అయినపుడు పాతాళంలో పడిపోతున్నట్టు ఉంటుంది. బ్రేకప్ బాధ వల్ల చాలామంది తొందరగా కోలుకోలేరు. దీనివల్ల తర్వాత వారి భవిష్యత్తు మీద ప్రభావం ఉంటుంది. అందుకే బ్రేకప్ బాధను తట్టుకోవడానికి ఏం చేయాలో చూద్దాం. తొందరగా మరో డేట్ ని స్టార్ట్ చేయొద్దు: చాలామంది ఇదే తప్పు చేస్తుంటారు. ఒక బ్రేకప్ అవగానే మరో రిలేషన్ లోకి దిగిపోతుంటారు. బ్రేకప్ బాధ నుండి తొందరగా ఉపశమనం చెందుతారు కానీ ఆ తర్వాత మీరు ఎక్కువకాలం బాధపడాల్సి వస్తుంది. బ్రేకప్ బాధలో ఉన్నప్పుడు మనసు ఉల్లాసంగా ఉండదు, కాబట్టి మరో డేట్ మొదలెట్టడానికి టైమ్ తీసుకోండి.
మాజీ లవర్ ని బ్లాక్ చేస్తే సగం బాధలు తీరినట్టే
కాలాన్ని నమ్మండి: ఏ విషయాన్నయినా మర్చిపోయేలా చేసే కాలానికి ఉంది. మీ బాధను కూడా కాలం తగ్గించేస్తుంది. ఇప్పుడున్నంత బాధ రేపు ఉండదని అర్థం చేసుకోండి. మీ మాజీ లవర్ ని బ్లాక్ చేయండి: బ్లాక్ చేయడం చిన్నపిల్లల చర్యలని ఎవరైనా చెబితే నమ్మకండి. బ్లాక్ చేయకపోతే పదే పదే అవతలి వారి ఆనవాళ్ళు మీకు కనిపించి మిమ్మల్ని మరింత బాధపెడతాయి. కుంగిపోవద్దు, బయటకు చెప్పుకోండి: మీ మనసులో బాధను దాచేసుకుని కుంగిపోవడం కన్నా, బాధను బయటకు చెప్పేసుకుని ఉపశమనం చెందడమే మంచిదని గుర్తుంచుకోండి. చెమట చిందించండి: లవర్ వదిలేసి వెళ్ళినపుడు మీరు మరింత ఫిట్ గా ఉండాలి. అందుకోసం రోజూ వ్యాయామం చేయండి.