Page Loader
మీకు తెలియకుండానే మీ బిహేవియర్ అవతలి వారిని నొప్పించే సందర్భాలు
మీకు తెలియకుండానే మీ బిహేవియర్ కఠినంగా ఉండే సందర్భాలు

మీకు తెలియకుండానే మీ బిహేవియర్ అవతలి వారిని నొప్పించే సందర్భాలు

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 03, 2023
06:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడే మాటలు మీకు సాదాసీదాగానే కనిపిస్తాయి. కానీ అవతలి వారిని, స్నేహితులను అవి చాలా బాధపెడతాయి. మీకు నిజంగా వాళ్ళని బాధపెట్టాలని ఉండదు. అయినా అనుకోకుండా అలా జరిగిపోతూ ఉంటుంది. అలాంటి కొన్ని సందర్భాలేంటో చూద్దాం. వయసు చెప్పడం: అవతలి వాళ్ళు అడక్కముందే మీ వయసు ఇంతుంటుందని చెప్పడం వాళ్లను బాధపెడుతుంది. వయసు అనేది సున్నితమైన విషయం. దానిగురించి ఎవ్వరు కూడా బయట చెప్పాలనుకోరు. అందుకే అవతలి వారి వయసును వాళ్ళ ముందు గెస్ చేయడం మానేయండి. దార్లో ఉన్నానని చెప్పడం: ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇంకా స్టార్ట్ అవకముందే దార్లో ఉన్నానని చెప్పేస్తుంటారు. దానివల్ల మీరు తొందరగా వస్తున్నారేమోనని ఎదురు చూసేవాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది.

బంధం

మీ బిహేవియర్ కఠినంగా ఉండే కొన్ని సందర్భాలు

సింగిల్ గా ఎందుకు ఉన్నావని అడగడం: సింగిల్ గా ఉండడమనేది అసాధారణమైన విషయం కాదు, అలాంటప్పుడు ఎందుకు సింగిల్ గా ఉన్నారని అడగడం అనవసరం. దానికి వారి వద్ద చాలా కారణాలు ఉండి ఉంటాయి. వాటిని ఎవరితోనూ పంచుకోవాలని వాళ్ళకు ఉండకపోవచ్చు. అతిధి ఇంట్లో వంటలు చేయడం: ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానించారనుకోండి, వాళ్ళు మీకంతగా పరిచయం లేదు. అలాంటప్పుడు అక్కడికి అతిధిగా వెళ్ళినపుడు వాళ్ళు పెట్టింది తిని రావాలి. అంతేకానీ మీకు వంట వచ్చు కదా అని వండుతూ కూర్చోకూడదు. ఇది అవతలి వారికి ఇబ్బంది కలిగిస్తుంది. అంత్యక్రియల దగ్గర ఎలా ఉన్నావని అడగడం: అంత్యక్రియలకు ఎవరెవరో వస్తే, వాళ్ళు మీకు చాలా రోజుల తర్వాత కనిపిస్తే వెళ్ళి ఎలా ఉన్నావని అడగవద్దు.