బంధం: మీ రొమాంటిక్ జర్నీలో సింగిల్ స్నేహితులను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి
ఇద్దరు రొమాంటిక్ కపుల్స్ మధ్య మూడవ వ్యక్తి ఎందుకు వస్తారు పానకంలో పుడకలాగా అని మీకు అనుమానం వస్తుండవచ్చు. కానీ కొన్నిసార్లు మూడవ వ్యక్తిని మీరు వద్దని చెప్పలేరు. మీకు తెలిసో తెలియకో వాళ్ళు మీతోనే ఉంటారు. మీ పార్ట్ నర్ తో మీ బంధం బలపడని సమయాల్లో మీరే మూడవ వ్యక్తిని తోడుగా తీసుకెళ్తారు. అది కూడా మీకు బాగా క్లోజ్ గా ఉన్నవాళ్ళను. క్రమేణా అదే అలవాటుగా మారుతుంటుంది. ఒకవేళ మూడవ వ్యక్తి మీ కపుల్స్ కి కామన్ ఫ్రెండ్ అయితే అప్పుడు వాళ్ళని మీతో పాటు ఖచ్చితంగా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో కపుల్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
మూడవ ఫ్రెండ్ ని మేనేజ్ చేయడానికి రొమాంటిక్ కపుల్స్ తెలుసుకోవాల్సిన విషయాలు
ఫ్రెండ్ షిప్ చేయాలి: మూడవ వ్యక్తి మీ పార్ట్ నర్ కి బాగా క్లోజ్ అయినపుడు మీరు కూడా ఫ్రెండ్ షిప్ చేయక తప్పదు. మూడవ మనిషితో సమయం గడపండి: మీ మధ్యలోకి మూడవ వ్యక్తి రావడం ఇష్టం లేకపోతే, అవతలి వ్యక్తితో సెపరేట్ గా సమయం గడపండి. దానివల్ల అవతలి వారికి అర్థమైపోతుంది. బౌండరీస్ గుర్తుంచుకోండి: మూడవ వ్యక్తి మీ మధ్యలో ఉన్నప్పుడు మీ పార్ట్ నర్ తో మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. లేదంటే మీరు, మీ బంధం చులకనైపోతుంది. వాదన అనవసరం: మూడవ వ్యక్తి ముందర మీ పార్ట్ నర్ తో వాదన పెట్టుకోవద్దు. మీకేదైనా నచ్చకపోతే సెపరేట్ గా మీ పార్ట్ నర్ కి చెప్పండి.