బంధం: ప్రతీ దానిలో మీ జీవిత భాగస్వామి ఇన్వాల్స్ అవుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఏ బంధమైనా సరే దానికంటూ ఒక పరిమితి ఉంటుంది. ఎందుకంటే మీ జీవితంలో మీకంటూ కొంత స్పేస్ లేకపోతే అవతలి వాళ్ళకు మీరు చులకనగా మారతారు. ఏయే విషయాల్లో ఎలాంటి పరిమితులు ఉండాలో చూద్దాం. ఎమోషనల్: మీ జీవితంలో జరిగిన ప్రతీ సంఘటన అవతలి వారికి తెలియాల్సిన అవసరం లేదు. ఏ విషయాన్ని ఎప్పుడు చెప్పాలనేది మీకు తెలియకపోతే మీ మీద అవతలి వాళ్ళకు అధికారం వచ్చేస్తుంటుంది. భౌతికంగా పరిమితులు: మీ శరీరం మీది, మీరు అసౌకర్యంగా ఫీలయ్యేలా మీ బాడీని ఎవ్వరూ ముట్టుకోకుండా చూసుకోవాలి. అది ఫ్రెండ్ అయినా భాగస్వామి అయినా. మీకు అసౌకర్యంగా అనిపిస్తున్నప్పుడు అవతలి వాళ్ళ నుండి దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి. దానివల్ల మీకు ప్రశాంతంగా ఉంటుంది.
బంధంలో ఉండాల్సిన బౌండరీస్
శృంగార పరిమితులు: శృంగార జీవితంలో కూడా పరిమితులు ఉంటాయి. శృంగారం పట్ల అవతలి వాళ్ళ ఆలోచనలు మీకు తెలియాలి. అలాగే మీ ఆలోచనలు వాళ్ళకు తెలియాలి. ఆర్థిక పరిమితులు: మీ జీతం ఎంత? దాన్లో ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎంత మిగులు చేస్తున్నారు? రోజువారి ఖర్చు ఎంత అనే ప్రతీ చిన్న విషయాలను పూసగుచ్చినట్లుగా అవతలి వాళ్ళతో చెప్పవద్దు. ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. లేదంటే అవతలి వాళ్ళకు మీకన్నా ముందు మీ సంపాదనే గుర్తొస్తుంది. తెలివికి సంబంధించిన పరిమితులు: అవతలి వారి తెలివిని చూసి అసహ్యించుకుంటే మీరు ఆ బంధంలో ఎక్కువ రోజులు ఉండలేరు. అందుకే మీ తెలివితో వాళ్లను పోల్చుకోకూడదని తెలుసుకోండి.