Loading...
white tiger: అరుదైన నీలి కళ్ల తెల్ల పులి.. 556 కి.మీ. ప్రయాణించి 'డెహ్రాడూన్ జూ'కి..
అరుదైన నీలి కళ్ల తెల్ల పులి.. 556 కి.మీ. ప్రయాణించి 'డెహ్రాడూన్ జూ'కి..

white tiger: అరుదైన నీలి కళ్ల తెల్ల పులి.. 556 కి.మీ. ప్రయాణించి 'డెహ్రాడూన్ జూ'కి..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2026
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెల్లని శరీరంపై నల్లటి చారలు.. ప్రత్యేకంగా కనిపించే నీలిరంగు కళ్లు..అరుదైన తెల్ల పులి'తేజస్' డెహ్రాడూన్ జూకు చేరుకుంది. గ్వాలియర్ నుంచి సుమారు 556కిలోమీటర్ల దూరాన్ని రోడ్డు మార్గంలో ప్రయాణించి వచ్చిన తేజస్.. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంది. దాదాపు నెల రోజుల తర్వాత సందర్శకుల సందడి మధ్య ఎన్‌క్లోజర్‌లోకి వచ్చే అవకాశం ఉంది. తేజస్ రాకతో వన్యప్రాణుల వైవిధ్యం పెరగనుంది తెల్ల పులి తేజస్ రాకతో డెహ్రాడూన్ జూలో వన్యప్రాణుల వైవిధ్యం మరింత పెరగనుందని అధికారులు చెబుతున్నారు. అరుదైన తెల్ల పులిని చూసేందుకు సందర్శకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే కొత్త వాతావరణానికి తేజస్ పూర్తిగా అలవాటు పడే వరకు,ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యే వరకు దాన్ని ప్రజలకు దూరంగా ఉంచనున్నారు.

వివరాలు 

పులుల మార్పిడిలో భాగంగా తేజస్ రాక

డెహ్రాడూన్ జూ, గ్వాలియర్ జూలాజికల్ పార్క్ మధ్య జరిగిన పులుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా తేజస్‌ను డెహ్రాడూన్‌కు తీసుకువచ్చారు.

ఈ మార్పిడిలో భాగంగా డెహ్రాడూన్ జూకు చెందిన దాదాపు ఐదేళ్ల వయసున్న 'భోలా' అనే రాయల్ బెంగాల్ పులిని గ్వాలియర్‌కు తరలించారు. ఇలా రెండు జూల మధ్య పులుల మార్పిడి జరిగింది.

12-14 గంటల పాటు సాగిన ప్రయాణం

గ్వాలియర్ నుంచి డెహ్రాడూన్ వరకు తేజస్ సుమారు 556కిలోమీటర్ల దూరాన్ని రోడ్డు మార్గంలో ప్రయాణించింది.

ఈ ప్రయాణానికి దాదాపు 12 నుంచి 14 గంటల సమయం పట్టింది.తేజస్‌తో పాటు పశువైద్యులు, అటవీశాఖ అధికారులు సహా మొత్తం 13మంది సభ్యులతో కూడిన బృందం ప్రయాణించింది.

ప్రయాణ సమయంలో పులి ఆరోగ్య పరిస్థితిని బృందం పర్యవేక్షించింది.

వివరాలు 

20 రోజుల పాటు క్వారంటైన్

డెహ్రాడూన్ చేరుకున్న తేజస్‌ను సుమారు 20 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు.

ఈ సమయంలో ఎన్‌క్లోజర్ కీపర్, పశువైద్యుడు మాత్రమే దాని వద్దకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.

తేజస్ ఆరోగ్యం, తీసుకునే ఆహారం, ప్రవర్తన, అలాగే కొత్త వాతావరణానికి అది ఎలా అలవాటు పడుతుందనే అంశాలను అధికారులు నిశితంగా గమనిస్తారు.

తెల్ల పులి ప్రత్యేక జాతి కాదు

తెల్ల పులి అనేది ప్రత్యేకమైన పులి జాతి కాదు. దాని తెల్లని రంగుకు కారణం అరుదైన జన్యు లక్షణం.

అల్బినో జంతువులకు భిన్నంగా తెల్ల పులుల శరీరంపై సహజమైన నల్లటి చారలు కనిపిస్తాయి.

ఇవి బెంగాల్ పులుల్లో కనిపించే సహజ రంగు వైవిధ్యంగా పరిగణించబడతాయి.

ADVERTISEMENT

వివరాలు 

అరుదైన రూపమే ప్రత్యేక ఆకర్షణ

తెల్లని శరీరం, నల్లటి చారలు, నీలి కళ్లతో కనిపించే రూపం కారణంగా తెల్ల పులులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఇదే కారణంగా ప్రపంచంలోని పలు జూలలో వీటిని సందర్శకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంటారు. తేజస్ కూడా డెహ్రాడూన్ జూలో కొత్త ఆకర్షణగా మారనుంది.

అయితే క్వారంటైన్, ఆరోగ్య పరిశీలన పూర్తయిన తర్వాతే సందర్శకులకు దాన్ని చూసే అవకాశం కల్పించనున్నారు.

ADVERTISEMENT