పక్షి జాతి ఆవిర్భావం గురించి చెప్పే డైనోసార్ లాంటి తలతో ఉన్న శిలాజం
చైనాలో వెలికితీసిన 120 మిలియన్ సంవత్సరాల పురాతన శిలాజానికి విచిత్రమైన శరీర నిర్మాణం అంటే డైనోసార్‌ను పోలిన తల, పక్షిని పోలిన శరీరంతో ఉంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు "క్రాటోనావిస్ జుయ్" అనే శిలాజ నమూనాను అధ్యయనం చేశారు. ఈ పుర్రె పక్షులలా కాకుండా టైరన్నోసారస్ రెక్స్ డైనోసార్ ఆకారంలో ఉందని కనుగొన్నారు. డైనోసార్ల నుండి పక్షులు ఉద్భవించాయని అందరికి తెలిసిందే, అయితే ఇటీవల వెలికితీసిన చైనీస్ శిలాజం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. శాస్త్రవేత్తలు మొదట హై-రిజల్యూషన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) ద్వారా నమూనాను అధ్యయనం చేశారు. తరువాత, డిజిటల్‌గా ఎముకలను తీసి, పుర్రె అసలు ఆకారం పునర్నిర్మించారు, ఇది శిలాజ పుర్రె డైనోసార్‌ల పుర్రెలాగా ఉందని కనుగొన్నారు.
క్రాటోనావిస్ శిలాజంలో పొడవాటి స్కాపులా ఉంది
క్రాటోనావిస్ శిలాజంలో పొడవాటి స్కాపులా ఉంది. భుజంలో ఒక ఎముక, మొదటి మెటాటార్సల్ (పాద ఎముక), ఇవి శిలాజ పక్షులతో సహా ఆధునిక పక్షులలో లేని లక్షణాలు. ఈ స్కాపులా వలన ఈ జాతులు తమ రెక్కలను బాగా తిప్పగలవు. పాదాల ఎముక గురించి మాట్లాడుతూ, డైనోసార్ల నుండి పక్షులకు మారే సమయంలో, క్రాటోనావిస్ మొదటి మెటాటార్సల్ సహజ ప్రక్రియకు గురై దానిని చిన్న ఎముకగా మారి ఉండచ్చని అధ్యయనం పేర్కొంది. క్రాటోనావిస్ జుయ్ శరీర నిర్మాణ సంబంధమైన లక్షణాలు అన్ని జీవులలో వచ్చే శరీర నిర్మాణ మార్పులు ఎలా వస్తాయో చూపిస్తాయి . ఈ విధంగా అనేక రకాల విభిన్న మార్గాల్లో పక్షి జాతి పుట్టుక సంభవించింది.