1Password Data Breach: 1Passwordకు భారీ షాక్.. కస్టమర్ల పేర్లు, ఈమెయిల్స్ లీక్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ పాస్‌వర్డ్ మేనేజర్ 1Passwordలో సైబర్ దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో కొంతమంది కస్టమర్ల పేర్లు, ఈమెయిల్ చిరునామాలు సహా ప్రాథమిక ఖాతా వివరాలు బయటపడ్డాయి. అయితే వినియోగదారులు తమ వాల్ట్‌లలో భద్రపరిచిన పాస్ వర్డ్‌లు, ఇతర సున్నితమైన సమాచారాన్ని హ్యాకర్లు యాక్సెస్ చేయలేకపోయారని కంపెనీ స్పష్టం చేసింది. నవంబర్ 19న ఈ దాడిని గుర్తించినట్లు తెలిపింది. ఓ ఉద్యోగి కార్పొరేట్ GitHub ఖాతాను హ్యాకర్ స్వాధీనం చేసుకోవడంతో ఈ సమస్య మొదలైనట్లు వెల్లడించింది.
Details
GitHub ఖాతా ద్వారా సిస్టమ్‌లోకి చొరబాటు
ఉద్యోగి GitHub ఖాతాపై నియంత్రణ సాధించిన తర్వాత హ్యాకర్ 1Passwordకు చెందిన ప్రైవేట్ రిపాజిటరీల నుంచి సోర్స్ కోడ్‌ను కాపీ చేసినట్లు కంపెనీ తెలిపింది.
అంతటితో ఆగకుండా అంతర్గత సర్వర్లలో హానికరమైన కోడ్‌ను ప్రవేశపెట్టి యూజర్లకు సంబంధించిన కొన్ని వివరాలను డౌన్‌లోడ్ చేశాడు.
సంస్థకు చెందిన CI/CD వ్యవస్థను కూడా యాక్సెస్ చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవస్థలో టెక్నికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించిన కొన్ని రహస్యాలు ఉంటాయి.
అయితే హ్యాకర్ మొదటిసారి ఉద్యోగి ఖాతాలోకి ఎలా ప్రవేశించాడన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
Details
యూజర్లలో కొందరి వివరాలే బయటకు..
ఈ దాడిలో మొత్తం ఎంతమంది కస్టమర్లు ప్రభావితమయ్యారన్నది 1Password ఇప్పటివరకు వెల్లడించలేదు.
అయితే కొంతమంది యూజర్ల ప్రాథమిక ఖాతా రికార్డులను హ్యాకర్ డౌన్‌లోడ్ చేసినట్లు తెలిపింది.
ఇందులో పేర్లు, ఈమెయిల్ చిరునామాలు, అకౌంట్ ఐడీలు, యూజర్ ఐడీలు ఉన్నాయి.
ఖాతా ఎప్పుడు సృష్టించారు, చివరిసారి ఎప్పుడు లాగిన్ అయ్యారన్న వివరాలు కూడా ఉన్నాయి. కొన్ని ఆహ్వానాలు, అకౌంట్ రికవరీ, ప్రొవిజనింగ్ ఈమెయిల్స్‌కు సంబంధించిన టోకెన్లు కూడా బయటపడ్డాయి.
అయితే వీటిలో కొన్ని సమాచారాలు రహస్యమైనవి కావని కంపెనీ పేర్కొంది.
Details
పాస్‌వర్డ్‌లు, వాల్ట్‌లు మాత్రం సురక్షితం
ఈ ఘటనలో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే.. యూజర్ల వాల్ట్‌లకు హ్యాకర్లు చేరుకోలేదని 1Password స్పష్టం చేసింది.
ఖాతా పాస్‌వర్డ్‌లు, Secret Keysను కంపెనీ తన సర్వర్లలోనే నిల్వ చేయదు. ఇవే యూజర్ వాల్ట్‌లలోని సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్, డీక్రిప్ట్ చేయడానికి అవసరమవుతాయి.
అందువల్ల కంపెనీ సర్వర్లలోకి చొరబడినా అక్కడి నుంచి నేరుగా యూజర్ల సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను చదవడం సాధ్యం కాదని 1Password వివరిస్తోంది.
అంటే డేటా బ్రీచ్ జరిగినా వాల్ట్‌లలోని అసలు పాస్‌వర్డ్‌లకు ప్రమాదం జరగలేదన్నమాట.
Details
ఫిషింగ్ ముప్పుపై యూజర్లకు హెచ్చరిక
అయితే అసలు ప్రమాదం ఇప్పుడు మొదలయ్యే అవకాశం ఉందని కంపెనీ హెచ్చరించింది.
పేర్లు, ఈమెయిల్ చిరునామాలు బయటపడటంతో సైబర్ నేరగాళ్లు నమ్మదగినట్లుగా కనిపించే నకిలీ మెయిల్స్ పంపి యూజర్ల నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేయొచ్చు.
దీన్నే ఫిషింగ్ అంటారు. అందుకే 1Password భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది. దెబ్బతిన్న GitHub ఖాతాను డిసేబుల్ చేయడంతో పాటు బయటపడిన అంతర్గత క్రెడెన్షియల్స్‌ను మార్చింది.
అదనంగా స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించి ఘటనపై సమీక్ష చేయిస్తోంది.
Details
ఈసారి ఈమెయిల్ కోడ్ కూడా బలంగా..
ఫిషింగ్ దాడులను అడ్డుకునేందుకు 1Password మరో కీలక మార్పు చేసింది.
ఇప్పటివరకు ఈమెయిల్ వెరిఫికేషన్ కోసం ఉపయోగించే ఆరు అంకెల కోడ్‌లను ఇకపై 10 అక్షరాలు, సంఖ్యలతో కూడిన కోడ్‌లుగా మార్చింది.
దీంతో యూజర్లకు వచ్చే అనుమానాస్పద సందేశాలను గుర్తించడం మరింత ముఖ్యంగా మారింది.
ముఖ్యంగా 1Password పేరుతో వచ్చే మెయిల్స్‌లో లింకులు క్లిక్ చేసే ముందు వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి.
ప్రస్తుతం ఈ డేటా బ్రీచ్ వల్ల ఎంతమంది యూజర్లు ప్రభావితమయ్యారన్నది తెలియరాలేదు. అయితే వాల్ట్‌లు, పాస్‌వర్డ్‌లు సురక్షితంగానే ఉన్నాయని కంపెనీ హామీ ఇచ్చింది.