LOADING...
USA: జార్జియాలో భూమి కంటే పురాతనమైన ఉల్క శకలం..! 
జార్జియాలో భూమి కంటే పురాతనమైన ఉల్క శకలం..!

USA: జార్జియాలో భూమి కంటే పురాతనమైన ఉల్క శకలం..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2025
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ సంవత్సరం జూన్‌ 26న జార్జియాలోని ఒక ఇంటిపై పడిన ఉల్క రహస్యాన్ని అక్కడి శాస్త్రవేత్తలు చేధించారు. మెక్‌డొనౌగ్‌లోని ఆ ఇంటిపై ఉన్న ఇన్సులేషన్‌ పొరలు, ఇతర అడ్డంకులను దాటుకుని వచ్చిన ఆ ఉల్క భూమిపై సుమారు సెంటీమీటరున్నర లోతైన చిన్న గుంతను సృష్టించింది. ఈ ఘటన జార్జియా,దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో పెద్ద సంచలనం రేపింది. చిన్న చెర్రీ టమాటా పరిమాణంలో ఉన్న ఈ ఉల్క శకలం బరువు కేవలం 23 గ్రాములు మాత్రమే. ఇది సూపర్‌సోనిక్‌ వేగంతో భూమిని ఢీకొన్నప్పుడు వచ్చిన ఘోర శబ్దం చుట్టుపక్కల కౌంటీల వరకూ వినిపించింది.

వివరాలు 

4.54 బిలియన్‌ సంవత్సరాల క్రితం ఏర్పడిన భూమి 

జార్జియాలోని శాస్త్రవేత్తలు ఆ శకలంపై విపులమైన పరిశోధనలు నిర్వహించారు. జియాలజిస్ట్‌ స్కాట్‌ హారిస్‌ ప్రకారం, ఈ ఉల్క దాదాపు 4.56 బిలియన్‌ సంవత్సరాల క్రితం ఏర్పడింది. అంటే, భూమి ఏర్పడక మునుపే .. సుమారు 2 కోట్ల సంవత్సరాల ముందే.. ఇది ఉనికిలోకి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. భూమి సుమారు 4.54 బిలియన్‌ సంవత్సరాల క్రితం ఏర్పడిందన్న అంచనాలున్నాయి. ఈ శకలం అంగారకుడు (Mars),బృహస్పతి (Jupiter) మధ్య పరిభ్రమించే ఒక తోకచుక్క నుంచి విడిపోయి వచ్చి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

వివరాలు 

లివింగ్‌ రూమ్‌లో ఇప్పటికే ఖగోళ ధూళి కణాలు

ఆ ఉల్క శకలంపై శాస్త్రవేత్తతో మాట్లాడిన ఆ ఇంటి యజమాని, తన లివింగ్‌ రూమ్‌లో ఇప్పటికే ఖగోళ ధూళి కణాలు ఉన్నాయని తెలిపాడు. ఉల్క ఇంటిని ఢీకొన్న సమయంలో సోనిక్‌ బూమ్‌ (అత్యంత వేగవంతమైన వస్తువు గాలి గోడను ఛేదించినప్పుడు వచ్చే శబ్దం), పైకప్పును తాకిన ధ్వని, నేలను తాకిన ప్రతిధ్వని అన్నీ స్పష్టంగా వినిపించాయని వివరించాడు. ఆ క్షణం, తన పక్కనే ఒక భారీ రైఫిల్‌ పేల్చినట్టుగా అనిపించిందని ఆయన చెప్పాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జార్జియాలో భూమి కంటే పురాతనమైన ఉల్క శకలం..!