Anthropic's Claude Code: ఒక్క లైన్ కోడ్ లేకుండానే ఐఫోన్ యాప్… ఏఐతో '10 మినిట్ గీత' రూపొందించిన ఆనిష్ మూంకా
ఈ వార్తాకథనం ఏంటి
ఒక్క లైన్ కోడ్ కూడా రాయకుండా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఐఫోన్ కోసం పూర్తి స్థాయి యాప్‌ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆనిష్ మూంకా. తాను రోజూ భగవద్గీత చదవాలనుకున్నప్పటికీ తనకు నచ్చే విధంగా ఉన్న యాప్ దొరకకపోవడంతో, కోడింగ్ నేర్చుకునే బదులు Anthropic సంస్థకు చెందిన Claude Code అనే ఏఐ టూల్‌ను పూర్తిగా ఉపయోగించి యాప్‌ను రూపొందించారు. కేవలం ఒక వారం రోజుల్లోనే "10 మినిట్ గీత" అనే యాప్‌ను తయారు చేసి ఆపిల్ యాప్ స్టోర్‌లో విడుదల చేశారు.
వివరాలు
ఏఐ సుమారు 50కిపైగా ఫైళ్లు సృష్టించి.. కంటెంట్ అన్నింటినీ సిద్ధం చేసింది
ఈ యాప్‌లో భగవద్గీత నుంచి తీసుకున్న 239 రోజువారీ పఠనాలు, అసలు సంస్కృత శ్లోకాలు, వాటి ఉచ్చారణలు, ఒక్కో శ్లోకానికి అర్థాలు, వ్యక్తిగత ఆలోచనల కోసం సూచనలు, రోజూ చదివినట్లయితే స్ట్రీక్ చూపించే క్యాలెండర్ హీట్‌మ్యాప్, పంచుకునే విధంగా శ్లోక కార్డులు, హిందీ-ఇంగ్లిష్ భాషల మద్దతు, డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఆఫ్‌లైన్‌లో కూడా చదివే సౌకర్యం ఉన్నాయి. ఫాంట్లు మార్చుకునే అవకాశం, లైట్-డార్క్ మోడ్‌లు కూడా ఉన్నాయి. యాప్ నిర్మాణం మొత్తం Claude Code ద్వారానే జరిగిందని, తాను కేవలం సాధారణ ఇంగ్లిష్‌లో ఫీచర్లను వివరించానని మూంకా తెలిపారు. ఏఐ సుమారు 50కిపైగా ఫైళ్లు సృష్టించి నావిగేషన్, స్టోరేజ్ వ్యవస్థలు, కంటెంట్ అన్నింటినీ సిద్ధం చేసిందని చెప్పారు.
వివరాలు
యాప్ తయారీకి మొత్తం ఖర్చు సుమారు 200 డాలర్లు
ఎక్కడైనా సమస్యలు వస్తే స్క్రీన్‌షాట్లు పెట్టి వివరించగానే, ఏఐ వాటిని గుర్తించి సరిచేసిందన్నారు. ఈ యాప్ తయారీకి మొత్తం ఖర్చు సుమారు 200 డాలర్లే అయ్యిందని, సాఫ్ట్‌వేర్ తయారీలో అసలు అడ్డంకి టెక్నికల్ స్కిల్స్ కాదని, పరిష్కరించాల్సిన సమస్యను స్పష్టంగా ఆలోచించడమే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఐ ఆధారిత డెవలప్‌మెంట్ టూల్స్‌తో టెక్నికల్ పరిజ్ఞానం లేని వాళ్లూ తక్కువ ఖర్చుతో వేగంగా యాప్‌లు తయారు చేయగలరని ఈ అనుభవం చూపుతోందని మూంకా తెలిపారు. భవిష్యత్తులో వాయిస్ ఫీచర్లు, ఏఐ చాట్ సపోర్ట్, మరిన్ని భాషలు జోడించే ఆలోచన ఉందని కూడా ఆయన వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆనిష్ మూంకా చేసిన ట్వీట్
Started a week ago, not knowing how to write a single line of code
— Anish Moonka (@AnishA_Moonka) February 5, 2026
I wanted to read the Bhagavad Gita daily, but couldn't find an app that felt right. So I built one.
Ended with a full iOS app live @10minutegita on the App Store:
→ 239 daily readings of the Bhagavad Gita
→… pic.twitter.com/0ldzxmDsxq