Planet parade : ఆకాశంలో అరుదైన దృశ్యం.. టెలిస్కోప్ అవసరం లేకుండానే గ్రహాల కవాతు
ఈ వార్తాకథనం ఏంటి
జనవరి 21న రాత్రి ఆకాశంలో మరో అద్భుతమైన దృశ్యం కనువిందు చేయనుంది.
ఈ అరుదైన ఖగోళ దృశ్యాన్ని బైనాక్యులర్స్ సాయం లేకుండానే చూడొచ్చు. జనవరి 21 నుండి జనవరి 31 వరకు గ్రహాల కవాతు ఉంటుంది.
ఈ కాలంలో ఆరు గ్రహాలు - శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్లు ఒకే వరుసలో కనిపిస్తాయి. ఈ గ్రహాలను టెలిస్కోప్ లేకుండానే చూడగలుగుతారు.
ఈ దృశ్యాన్ని పరేడ్ ఆఫ్ ప్లానెట్స్ అని కూడా అంటారు. నిజానికి గ్రహాలు అంతరిక్షంలో వరుసలో లేవు, కానీ భూమి నుంచి చూస్తే అవి వరుసగా ఉండటంలా కనిపిస్తాయి.
Details
బైనాక్యులర్స్ ద్వారా చూసే అవకాశం
బైనాక్యులర్స్ ద్వారా చూస్తే ఈ దృశ్యం మరింత స్పష్టంగా కన్పిస్తుంది.
అంతేకాదు మార్చి 8న ఏడు గ్రహాలు - మార్స్, బృహస్పతి, యురేనస్, వీనస్, నెప్ట్యూన్, శని, మెర్క్యురీ ఒకే వరుసలో కనిపిస్తాయి. ఈ అరుదైన దృశ్యం 10 రోజుల పాటు కనిపిస్తుంది.
జనవరి 21 నుంచి రాత్రి 8:30 గంటల సమయంలో గ్రహాలను చూడటం ప్రారంభించి రాత్రి 11:30 గంటల వరకు వీక్షించవచ్చు. గ్రహాలు సూర్యాస్తమయం తర్వాత సుమారు మూడు గంటలపాటు కనిపించి అదృశ్యమవుతాయి.
టెలిస్కోప్ అవసరం లేకుండా శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శనిగ్రహాలను కేవలం కళ్ళతో చూడవచ్చు. నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను స్పష్టంగా చూడటానికి టెలిస్కోప్‌ను ఉపయోగించాలి.
Details
అమెరికా, మెక్సికో, కెనడా, ఇండియాలోని ప్రజలు చూడొచ్చు
జనవరి 21 నుంచి 31 వరకు గ్రహాలు సూర్యాస్తమయం తర్వాత కనిపిస్తాయి.
మార్స్, బృహస్పతి, యురేనస్ వంటి గ్రహాలు రాత్రిపూట ఉద్భవించి మరింత స్పష్టంగా కన్పిస్తాయి. వీటిని చూడటానికి కొండలు, బహిరంగ ప్రదేశాలను ఎంచుకోవాలి.
తక్కువ లైట్ పొల్యూషన్ ఉన్న ప్రదేశమే ఇంకా మంచిది. ఈ అరుదైన దృశ్యాన్ని అమెరికా, మెక్సికో, కెనడా, భారతదేశ ప్రజలు స్పష్టంగా వీక్షించగలరు.