LOADING...
Blood Moon: ఆ రోజున ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఎప్పుడు, ఎలా చూడాలంటే?
ఆ రోజున ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఎప్పుడు, ఎలా చూడాలంటే?

Blood Moon: ఆ రోజున ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఎప్పుడు, ఎలా చూడాలంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2025
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఖగోళ శాస్త్రం ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విశేషం త్వరలోనే ఆకాశాన్ని అలరించనుంది. రాబోయే సెప్టెంబర్ 7, 2025న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈసందర్భంగా ఆకాశంలో అద్భుతమైన బ్లడ్ మూన్ కనిపించనుంది. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలో ఉండడం వల్ల అతడు సాధారణం కంటే పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఈ సమయంలో చంద్రుడు బంగారు ఎరుపు వర్ణంలో మెరవడం విశేషం. ఇది ఈఏడాది రెండో సంపూర్ణ చంద్రగ్రహణం కావడం, అలాగే హార్వెస్ట్ మూన్‌తో కలిసివస్తుండటం మరింత ప్రత్యేకతను కలిగిస్తోంది. శాస్త్రవేత్తల సమాచారం ప్రకారం, భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 11:00 నుంచి 12:22 వరకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్ ప్రాంతాల్లో ఈ దృశ్యం ఎంతో అందంగా కనిపించనుంది.

Details

ఎక్కడ కనిపిస్తుంది?

భారత్, చైనా, రష్యా, పశ్చిమ ఆస్ట్రేలియా, తూర్పు ఆఫ్రికా, అరబ్ దేశాల ప్రజలు ఈ గ్రహణాన్ని పూర్తిగా వీక్షించవచ్చు. ఉత్తర అమెరికాలో మాత్రం ఇది కనిపించదు. అయితే అలాస్కా పశ్చిమ భాగంలో పాక్షిక చంద్రగ్రహణం దర్శనమిస్తుంది. బ్రిటన్, పశ్చిమ యూరప్ ప్రాంతాల్లో చంద్రుడు ఉదయించగానే గ్రహణంలో కొంత భాగం వీక్షించే అవకాశం ఉంటుంది. భారతదేశంలో చంద్రగ్రహణ సమయాలు ప్రారంభం: సెప్టెంబర్ 7 రాత్రి 08:58 ముగింపు: సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 01:25 ఈ సమయం మొత్తం చంద్రుడు ఎరుపు, నారింజ వర్ణాలతో మెరిసిపోతాడు.

Details

బ్లడ్ మూన్ వెనుక శాస్త్రం 

చంద్రగ్రహణం సంభవించేది, భూమి నీడ పూర్తిగా చంద్రుడిపై పడినప్పుడు. ఈ సమయంలో సూర్యకాంతి నేరుగా చంద్రుడిని తాకదు. కానీ భూమి వాతావరణం గుండా వెళ్తూ సూర్యకాంతి విరూపం చెందుతుంది. తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన నీలి కాంతి ఎక్కువగా చెల్లాచెదురవుతుంది. పొడవైన తరంగదైర్ఘ్యం కలిగిన ఎరుపు కాంతి వంగి చంద్రుడిని చేరుతుంది. దీని ఫలితంగా చంద్రుడు ఎరుపు రంగులోకి మారుతాడు. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారు.