Page Loader
ఫోన్లు కొనడానికి ఫిజికల్ స్టోర్లకే ఓటు వేస్తున్న భారతీయులు
ఫిజికల్ స్టోర్ల వైపు మొగ్గు చూపుతున్న భారతీయులు

ఫోన్లు కొనడానికి ఫిజికల్ స్టోర్లకే ఓటు వేస్తున్న భారతీయులు

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 02, 2023
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత దశాబ్దం నుండి ఆన్లైన్ షాపింగ్ భారతదేశంలో పుంజుకుంది. అయితే ముఖ్యంగా గత అయిదారేళ్ళ నుండి అన్ని బ్రాండ్ల మొబైల్ ఫోన్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ ఊపందుకున్నప్పటికీ, భారతీయ వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్ల కోసం 2023లో ఫిజికల్ స్టోర్‌లకు వెళతారని, ఎందుకంటే తాము సొంతంగా చూసి అన్ని బాగున్నాయని నిర్ధారించుకున్నాకే కొంటున్నారని సైబర్ మీడియా రీసెర్చ్ చేసిన అధ్యయనంలో తేలింది. సైబర్ మీడియా రీసెర్చ్ (CMR) నివేదిక ప్రకారం, మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాల మద్దతుపై సంతృప్తి కోసం వినియోగదారులు ఆన్‌లైన్‌లో రీసెర్చ్ చేయడానికి, ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూన్నారని CMR హెడ్-ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ ప్రభు రామ్ అన్నారు.

మొబైల్

లావా బ్రాండ్ దేశంలో రిటైలర్ల విశ్వాసంలో మొదటి స్థానంలో ఉంది

2023 తర్వాత కూడా భారతదేశంలో మొబైల్ వ్యాపారానికి మూలస్తంభంగా ఆఫ్‌లైన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. సెల్-అవుట్ స్కీమ్‌లు, సకాలంలో చెల్లింపులు, లావాదేవీలలో పారదర్శకత వంటి వాటివలన ఈ వ్యాపారం కూడా లాభదాయకంగా కొనసాగడం రిటైల్ భాగస్వాములకు కలిసి వస్తుంది. లావా బ్రాండ్ దేశంలో రిటైలర్ల విశ్వాసంలో మొదటి స్థానంలో ఉంది. "ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్‌పై స్థిరమైన, దీర్ఘకాలిక దృష్టితో, లావా దాని పారదర్శక ప్రక్రియలు, సమయానుకూల చెల్లింపులు, ధరల నియంత్రణతో నడిచే రిటైలర్ నమ్మకంతో వ్యాపారం కొనసాగిస్తోంది" అని CMR ఇండస్ట్రీ కన్సల్టింగ్ గ్రూప్ హెడ్ సత్య మొహంతి అన్నారు. ఆఫ్‌లైన్ రిటైల్‌లో, స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ విజయం దాని రిటైల్ ఛానెల్ భాగస్వామి నమ్మకంపై ఆధారపడి ఉంటుందని ఆయన తన అభిప్రాయం తెలిపారు.