LOADING...
AI Call Assistant: గుర్తు తెలియని నంబర్లు, టెలీ మార్కెటింగ్ కాల్స్‌కు ఏఐ సమాధానం!
గుర్తు తెలియని నంబర్లు, టెలీ మార్కెటింగ్ కాల్స్‌కు ఏఐ సమాధానం!

AI Call Assistant: గుర్తు తెలియని నంబర్లు, టెలీ మార్కెటింగ్ కాల్స్‌కు ఏఐ సమాధానం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 01, 2025
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

మీ ఫోన్ కాల్స్ మిమ్మల్ని విసిగించాయా? ప్రతి కాల్‌కు రిప్లై రావడం లేదంటే సమస్యగా అనిపిస్తుందా? ఇప్పుడు దేశంలోనే తొలిసారి లాంచ్ అయిన ఏఐ కాల్ అసిస్టెంట్ మీ సమస్యను పరిష్కరిస్తుంది. 'ఈక్వల్ ఏఐ' ద్వారా మీ తరఫున ఏఐ కాల్స్‌కు సమాధానం ఇస్తుంది. హైదరాబాద్‌కి చెందిన టెక్ స్టార్టప్ ఈక్వల్ సరికొత్త 'ఈక్వల్ ఏఐ' కాల్ అసిస్టెంట్‌ను రూపొందించింది. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, టెలీ మార్కెటింగ్ కాల్స్‌కు ఈ ఏఐ సమాధానం ఇస్తుంది. అవతలి వ్యక్తులు అడిగే ప్రశ్నలకు సమాధానాన్ని ఇవ్వగలదు. ఇంపార్టెంట్ కాల్స్ వచ్చినప్పుడు రికార్డ్ చేయడం, మేసేజ్ నోట్ చేసుకోవడం వంటి ఫీచర్లతో బిజీగా ఉన్నప్పుడు ముఖ్యమైన కాల్స్ మిస్ కాకుండా చూసుకుంటుంది.

Details

ఫీచర్లు ఇవే

ఈక్వల్ ఏఐ ఒక కాల్ మేనేజ్‌మెంట్ టూల్‌గా పనిచేస్తుంది. 60% మంది మొబైల్ యూజర్లు రోజుకి 4-5 స్పామ్ కాల్స్ ఎదుర్కొంటున్నారని గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ టూల్ వాటిని అరికట్టడంలో సహాయపడుతుంది. కాంటాక్ట్స్‌లో సేవ్ చేసిన నంబర్లకు రిప్లై ఇవ్వదు; కేవలం కొత్త నంబర్లకు మాత్రమే సమాధానం ఇస్తుంది. ఉదాహరణకు డెలివరీ ఏజెంట్ ఫోన్ చేస్తే, అడ్రెస్ వివరాలు చెప్పగలదు. అవసరమైతే మీరు మధ్యలో జాయిన్ అవ్వడం ద్వారా ప్రత్యక్షంగా మాట్లాడవచ్చు. ప్రస్తుతానికి, ఈ యాప్ డెలి ఎన్‌సీఆర్‌లోని ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే దేశంలోని ఇతర నగరాల్లో కూడా అందుబాటులోకి రానుందని, ఐఓఎస్ వెర్షన్ కూడా రాబోతుందని చెప్పారు.