Airtel-Apple: ఎయిర్‌టెల్ రూ.999 ప్లాన్ తీసుకుంటే.. iCloud+, Apple TV ఉచితం
ఈ వార్తాకథనం ఏంటి
టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో కొత్త ప్రయోజనాలను తీసుకొచ్చింది. రూ.999, అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ఉపయోగిస్తున్న కస్టమర్లకు ఇకపై Apple iCloud+, Apple TV, Apple Arcade సేవలను అందించనుంది. దీంతో మొబైల్ కనెక్టివిటీతో పాటు క్లౌడ్ స్టోరేజ్, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్ సేవలను ఒకే ప్లాన్‌లో పొందొచ్చు.
వివరాలు
iCloud+తో డేటా స్టోరేజ్, బ్యాకప్
ఈ బండిల్‌లో భాగంగా లభించే iCloud+ ద్వారా ఫొటోలు, ఫైల్స్,పాస్‌వర్డ్‌లు,కాంటాక్ట్స్ తదితర డేటాను Apple పరికరాల మధ్య స్టోర్ చేసి సింక్ చేసుకోవచ్చు.
క్లౌడ్ బ్యాకప్ సదుపాయం కూడా ఉంటుంది. కొత్త Apple డివైస్‌కు మారినప్పుడు పాత డేటాను సులభంగా తిరిగి పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ Apple పరికరాలు ఉపయోగించే వారికి ఈ సదుపాయం ఉపయోగకరంగా ఉంటుంది.
Apple TV, Apple Arcade కూడా..
iCloud+తో పాటు అర్హత ఉన్న Airtel కస్టమర్లకు Apple TV సేవ కూడా లభిస్తుంది. ఇందులో Apple రూపొందించిన ఒరిజినల్ సిరీస్‌లు, సినిమాలను చూడొచ్చు.
అదే విధంగా Apple Arcade ద్వారా వివిధ గేమ్స్‌ను యాడ్స్ లేకుండా ఆడే అవకాశం ఉంటుంది.
వివరాలు
రూ.999 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో ఏమున్నాయంటే?
గేమ్స్‌లో అదనపు కొనుగోళ్లు అవసరం లేకుండా ఈ సేవను ఉపయోగించుకోవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.999 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో ముగ్గురు కుటుంబ సభ్యులకు సదుపాయం ఉంటుంది.
Fastlane టెక్నాలజీతో అన్‌లిమిటెడ్ డేటా, స్పామ్ ప్రొటెక్షన్, వివిధ ఎంటర్‌టైన్‌మెంట్ సబ్‌స్క్రిప్షన్లు ఇందులో ఉన్నాయి.
తాజాగా Apple సేవలు కూడా చేరడంతో ఈ ప్లాన్ ద్వారా మొబైల్ కనెక్టివిటీతో పాటు క్లౌడ్ స్టోరేజ్, వీడియో కంటెంట్, గేమింగ్ ప్రయోజనాలు పొందొచ్చు.
వివరాలు
ఎలా పొందాలి?
రూ.999 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న Airtel ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో ఉన్న కస్టమర్లకు ఈ Apple ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
అర్హత ఉన్న ప్లాన్‌కు మారాలనుకునే వారు Airtel యాప్ ద్వారా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. లేదంటే సమీపంలోని Airtel స్టోర్‌ను సందర్శించి ప్లాన్‌ను తీసుకోవచ్చు.
Airtel మార్కెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ అమిత్ త్రిపాఠి మాట్లాడుతూ.. ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను మరింత సులభంగా అర్థం చేసుకునేలా చేయడంతో పాటు కుటుంబ సభ్యులకు ఉపయోగపడే డిజిటల్ సేవలను అందించడమే లక్ష్యమని తెలిపారు.
iCloud+, Apple TV, Apple Arcadeలను ఒకే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అందించడం ద్వారా కస్టమర్లకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
వివరాలు
Apple సేవలు ఎవరికి ఉపయోగపడతాయి?
ఒకే కుటుంబంలో పలువురు Apple పరికరాలు ఉపయోగించే వారికి iCloud+ సదుపాయం ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.
ఫొటోలు,ఫైల్స్,ఇతర డేటాను వివిధ పరికరాల్లో సింక్ చేసుకోవడంతో పాటు క్లౌడ్‌లో బ్యాకప్ చేసుకోవచ్చు.
Apple TV ద్వారా ఒరిజినల్ కంటెంట్‌ను చూడొచ్చు. Apple Arcade ద్వారా ప్రకటనలు,ఇన్-యాప్ కొనుగోళ్లు లేకుండా గేమ్స్ ఆడే అవకాశం ఉంటుంది.
వివరాలు
Apple సేవలు ఎవరికి ఉపయోగపడతాయి?
ప్రస్తుతం Airtel వివిధ ధరల్లో ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. అయితే కొత్తగా ప్రకటించిన Apple ప్రయోజనాలు రూ.999, అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తాయి.
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం Airtelకు 15 దేశాల్లో 650 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారు.
భారత్‌లో మొబైల్ కనెక్టివిటీతో పాటు బ్రాడ్‌బ్యాండ్, ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆర్థిక సేవలను కూడా సంస్థ అందిస్తోంది.