Loading...
Airtel traiff hike: ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ యూజర్లకు షాక్‌.. రూ.50 పెరిగిన ప్లాన్‌ ధరలు
ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ యూజర్లకు షాక్‌.. రూ.50 పెరిగిన ప్లాన్‌ ధరలు

Airtel traiff hike: ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ యూజర్లకు షాక్‌.. రూ.50 పెరిగిన ప్లాన్‌ ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2026
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌ టెల్‌ షాకిచ్చింది. ఎంపిక చేసిన పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ల ధరలను రూ.50 చొప్పున పెంచింది. సవరించిన ధరలు అక్టోబర్‌ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లను నెల రోజుల్లో సమీపంలోని తదుపరి ప్లాన్‌కు అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే, ధరల పెంపుతో పాటు పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకు ఉచిత అంతర్జాతీయ రోమింగ్‌ సదుపాయాన్ని అందించనుంది. కొత్త ధరల ప్రకారం ఎయిర్‌టెల్‌ వ్యక్తిగత పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ ఇకపై రూ.499నుంచి ప్రారంభం కానుంది. ఇద్దరు సభ్యులు వినియోగించే ప్లాన్‌ ధర రూ.749గాఉండగా.. ముగ్గురు సభ్యులకు రూ.1,049,నలుగురు సభ్యులకు రూ.1,249,రూ.1,449 ప్లాన్‌లు అందుబాటులో ఉంటాయి. ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్నవారు కనీసం రూ.1,799 చెల్లించాల్సి ఉంటుంది.

వివరాలు 

ఐదు రోజుల పాటు ఉచితంగా ఈ ప్రయోజనాలు

అదే సమయంలో ఎయిర్‌టెల్‌ అందిస్తున్న ఉచిత అంతర్జాతీయ రోమింగ్‌ సదుపాయంలో 5జీబీ డేటా, 60 నిమిషాల వాయిస్‌ కాలింగ్‌, 25 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

ఈ ప్రయోజనాలు ఐదు రోజుల పాటు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.

ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ ఫ్యామిలీ ప్లాన్‌ తీసుకున్న కస్టమర్లందరూ ఈ ఉచిత అంతర్జాతీయ రోమింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

వివరాలు 

అదనంగా అంతర్జాతీయ రోమింగ్

ఇప్పటికే పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లకు ఫాస్ట్‌లేన్‌ టెక్నాలజీ (నెట్‌వర్క్‌ స్లైసింగ్‌), అపరిమిత డేటా, స్పామ్‌ ప్రొటెక్షన్‌ వంటి ప్రయోజనాలను అందిస్తున్నామని భారతీ ఎయిర్‌టెల్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ అమిత్‌ త్రిపాఠి తెలిపారు.

ఇప్పుడు వీటికి అంతర్జాతీయ రోమింగ్‌ సదుపాయాన్ని అదనంగా చేర్చినట్లు పేర్కొన్నారు.

మరోవైపు, ప్రైవేటు టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా అంతర్జాతీయ రోమింగ్‌ సేవలను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించిన కొద్దిరోజులకే ఎయిర్‌టెల్‌ కూడా ఇదే తరహా ప్రయోజనాన్ని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT