
Alcatel V3 Series: భారత్‌లో లాంచ్ అయిన అల్కాటెల్ V3 సిరీస్ .. 108MP కెమెరా, 5200mAh బ్యాటరీ
ఈ వార్తాకథనం ఏంటి
అల్కాటెల్ ఇండియా, NXTCell భాగస్వామ్యంతో కలిసి భారత మార్కెట్‌లో తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ అయిన V3 సిరీస్ ను అధికారికంగా విడుదల చేసింది.
ఈ సిరీస్‌లో Alcatel V3 Ultra 5G, V3 Pro 5G, V3 Classic 5G అనే మూడు మోడల్స్ ఉన్నాయి.
ఇందులో ముఖ్యంగా V3 Ultra,V3 Pro మోడల్స్ లో 120Hz NXTPAPER యాంటీ గ్లేర్ డిస్‌ప్లేను తొలిసారిగా ప్రవేశపెట్టారు.
వీటిలో ప్రత్యేకంగా NXTPAPER INK మోడ్ అనే ఫీచర్‌ను అందించారు.ఇది వినియోగదారులు ఈ-బుక్‌లు చదివేటప్పుడు కంటికి నష్టములేని విధంగా ఎలక్ట్రానిక్ పేపర్ అనుభూతిని కలిగించేందుకు రూపొందించబడింది.
ఒక బటన్‌తో ఈ మోడ్‌ను యాక్టివేట్ చేయవచ్చు.
వివరాలు
ఈ సిరీస్ లోని మూడు మోడల్స్ ఫీచర్లు, ధరలు ఇలా ఉన్నాయి:
ఇంకా, ఈ ఫోన్లలో SGS సర్టిఫైడ్ బ్లూ లైట్ ప్రొటెక్షన్, యాంటీ-రెఫ్లెక్టివ్ కోటింగ్ ఉండటంతో కళ్లకు హానికరం కాకుండా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
ప్రత్యేకమైన Max Ink Mode ద్వారా 7 రోజులు వరకూ రీడింగ్ అనుభూతిని వినియోగదారులు పొందవచ్చని తెలిపింది.
Alcatel V3 Ultra 5G:
డిస్‌ప్లే: 6.8 అంగుళాల FHD+ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, NXTPAPER టెక్నాలజీ, 650 నిట్స్ బ్రైట్నెస్
ప్రాసెసర్: MediaTek Dimensity 6300 (6nm)
ర్యామ్ & స్టోరేజ్: 6GB లేదా 8GB RAM, 128GB స్టోరేజ్, 2TB వరకు microSD సపోర్ట్
కెమెరా సెటప్: వెనుక 108MP + 8MP + 2MP ట్రిపుల్ కెమెరాలు, ముందు 32MP సెల్ఫీ కెమెరా
వివరాలు
Alcatel V3 Pro 5G:
ఆపరేటింగ్ సిస్టమ్: Android 14 (తరువాత Android 15 అప్‌డేట్ లభ్యం)
బ్యాటరీ: 5010mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్
ధర: 6GB వేరియంట్ - ₹19,999, 8GB వేరియంట్ - ₹21,999
Alcatel V3 Pro 5G:
డిస్‌ప్లే: 6.7 అంగుళాల HD+ స్క్రీన్, 120Hz NXTPAPER డిస్‌ప్లే
ప్రాసెసర్: Dimensity 6300
ర్యామ్ & స్టోరేజ్: 8GB RAM, 256GB స్టోరేజ్
కెమెరా సెటప్: వెనుక 50MP + 5MP, ముందు 8MP కెమెరా
ఆపరేటింగ్ సిస్టమ్: Android 15
బ్యాటరీ: 5200mAh, 18W ఫాస్ట్ ఛార్జింగ్
ధర: ₹17,999
వివరాలు
Alcatel V3 Classic 5G:
డిస్‌ప్లే: 6.7 అంగుళాల HD+ LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్: Dimensity 6300
ర్యామ్ & స్టోరేజ్: 4GB లేదా 6GB RAM, 128GB
స్టోరేజ్ కెమెరా సెటప్: వెనుక 50MP + 0.08MP, ముందు 8MP కెమెరా
ఆపరేటింగ్ సిస్టమ్: Android 15
బ్యాటరీ: 5200mAh, 18W ఫాస్ట్ ఛార్జింగ్
ధర: 4GB వేరియంట్ - ₹12,999, 6GB వేరియంట్ - ₹14,999
వివరాలు
అదనపు కామన్ ఫీచర్లు:
మూడు మోడల్స్ లోనూ IP54 డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్, స్టెరియో స్పీకర్లు, NFC, 3.5mm ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ 5G VoLTE, Wi-Fi 802.11 ac, Bluetooth 5.3, GPS వంటి ఫీచర్లు ఉన్నాయి.
అందుబాటు & లాంచ్ ఆఫర్లు: ఈ ఫోన్లు జూన్ 2 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ లో అమ్మకానికి వస్తాయి. రిటైల్ స్టోర్లలో త్వరలోనే విక్రయం ప్రారంభం అవుతుంది.
లాంచ్ ఆఫర్ల కింద: V3 Ultra & V3 Pro ఫోన్లపై ₹2000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (Axis, ICICI, SBI, HDFC కార్డులపై) లేదా ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది.
వివరాలు
మిడ్-రేంజ్ వినియోగదారులకు ఒక ఉత్తమ ఎంపిక
V3 Classic పై ₹1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లేదా ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. ఇంకా 3 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు అందుబాటులో ఉంటాయి.
ఈ ధరల్లో అలాంటి టెక్నాలజీ, డిస్‌ప్లే, కెమెరా,ఇతర ఫీచర్లను అందించటం వల్ల Alcatel V3 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు బడ్జెట్, మిడ్-రేంజ్ వినియోగదారులకు ఒక ఉత్తమ ఎంపికగా నిలవనుంది.