NVIDIA: స్నేహితుడిలా మాట్లాడే ఏఐ.. ఎన్‌విడియా 'పర్సోనాప్లెక్స్' సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ నివిడియా తాజాగా 'పర్సోనాప్లెక్స్' అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్‌ను విడుదల చేసింది. ఇది సాధారణ వాయిస్ అసిస్టెంట్లలా యూజర్ మాట్లాడటం పూర్తయ్యే వరకు ఎదురు చూడకుండా, ఒకేసారి వినడం-మాట్లాడటం చేయగలగడం దీని ప్రత్యేకత. మాటలతో పాటు టెక్స్ట్‌ను కూడా అర్థం చేసుకునే ఈ సిస్టమ్, మధ్యలో మాట ఆపిన, స్పందనలిచ్చినా, భావోద్వేగాలకు తగిన రీతిలో రియాక్ట్ అవుతుంది. ఇప్పటివరకు ఉన్న చాలా వాయిస్ అసిస్టెంట్లు యంత్రంలా మాట్లాడితే, పర్సోనాప్లెక్స్ మాత్రం "అహా", "సరే", "ఓకే", "అవునా", "అవును, నాకు అర్థమైంది" లాంటి సాధారణ మనుషుల మాటలతో వినిపిస్తూ, నిజంగా స్నేహితుడితో మాట్లాడుతున్న ఫీలింగ్ ఇస్తుందని ఎన్‌విడియా చెబుతోంది.
వివరాలు
రియల్ టైమ్‌లో సహజ సంభాషణలకు ఇది గేమ్‌చేంజర్
ఈ ఏఐని నిజమైన మనుషుల సంభాషణల రికార్డులతో పాటు, కృత్రిమంగా తయారు చేసిన డైలాగ్‌లతో ట్రెయిన్ చేశారు. సహజంగా మాట్లాడే విధానం, మధ్యలో మాటల్ని హ్యాండిల్ చేయడంలో ఇది ఇతర ఏఐ మోడళ్లకంటే మెరుగ్గా ఉందని కంపెనీ చెబుతున్నా, ప్రస్తుతం ఇది పూర్తిస్థాయి వినియోగదారుల ప్రొడక్ట్ కాదు. కొంతమంది యూజర్లు దీని ఆడియో ఫోన్ కాల్‌లా ఉందని, ఇంకా ఇంగ్లిష్‌కే పరిమితమై ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అయినప్పటికీ, రియల్ టైమ్‌లో సహజ సంభాషణలకు ఇది గేమ్‌చేంజర్‌గా మారే అవకాశముందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'పర్సోనాప్లెక్స్'పై హగ్గింగ్ మోడల్స్ చేసిన ట్వీట్
NVIDIA just dropped PersonaPlex-7B 🤯
— Hugging Models (@HuggingModels) February 15, 2026
A full-duplex voice model that listens and talks at the same time.
No pauses. No turn-taking. Real conversation.
100% open source. Free.
Voice AI just leveled up.https://t.co/YfzFQfBzMS pic.twitter.com/bVwJ5EFJFB