Page Loader
JioBharat B1: రిలయన్స్ జియో నుంచి మరో కొత్త ఫోన్.. రూ.1299కే జియోభారత్ బీ1​ 4జీ మొబైల్​!
రిలయన్స్ జియో నుంచి మరో కొత్త ఫోన్.. రూ.1299కే జియోభారత్ బీ1​ 4జీ మొబైల్​!

JioBharat B1: రిలయన్స్ జియో నుంచి మరో కొత్త ఫోన్.. రూ.1299కే జియోభారత్ బీ1​ 4జీ మొబైల్​!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2023
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల కాలంలో రిలయన్స్ జియో అతి చౌకైన మొబైల్స్‌ను తయారు చేస్తోంది. జియో భారత్ సిరీస్ లో భాగంగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. జియో భారత్ బీ1 పేరుతో ఈ నూతన ఫోన్‌ను తీసుకొచ్చారు. గతంలో ఈ సిరీస్‌లో భాగంగా వీ2, కే1 కార్బన్ మోడల్స్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ కొత్త గ్యాడ్జెట్‌లో ప్లాస్టిక్ ఎక్స్‌టీరియల్ ఉండనుంది. 2.4 ఇంచ్ డిస్ ప్లేతో పాటు ఇందులో సింగిల్ క్యూవీజీఏ కెమెరా ఇందులో ఉంది. 4జీ కనెక్టివిటీతో ఇందులో వీడియోలు, సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. ఈ మొబైల్ 2000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ధరను రూ.1299గా నిర్ణయించారు.

Details

యూపీఐ పేమెంట్స్ చేసుకొనే అవకాశం

ఈ ఫోన్ లో జియోపే యాప్‌ను డీఫాల్ట్‌గా అందించారు. దీంతో యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో అన్ని యాప్స్ ముందే ఇన్ స్టాల్ చేసి ఉంటాయి. ఇది మొత్తం 23 భాషలను సపోర్ట్ చేయనుంది. ఇందులో కేవలం జియో సిమ్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇతర సిమ్‌లను ఉపయోగించడానికి వీల్లేదు. జియో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. బ్లూటూత్‌, వైఫై, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, యూఎస్‌బీ వంటి కనెక్టివిటీ వంటి ఫీచర్స్‌ను ఇందులో అందించారు. ఈ ఫోన్ తీసుకున్న వెంటనే రూ.123 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.