Anthropic AI Development: AIతోనే ఆంత్రోపిక్ అభివృద్ధి.. రిపోర్ట్‌లో అదిరిపోయే వాస్తవాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన మలుపు కనిపిస్తోంది. శక్తివంతమైన AI వ్యవస్థలను తయారు చేసే పనిలో ఆంత్రోపిక్ తన AI మోడళ్లనే పరిశోధనా సహాయకులుగా ఉపయోగిస్తూ అభివృద్ధి వేగాన్ని భారీగా పెంచిందని METR నివేదిక వెల్లడించింది. సాధారణంగా రెండేళ్లలో సాధించే స్థాయి పురోగతిని సంస్థ ఏడాదిలోనే అందుకున్నట్లు అంచనా వేసింది. నవంబర్ 5న విడుదలైన ఈ నివేదిక కోసం METR సంస్థ 11 వారాల పాటు Anthropic అంతర్గత పరిశోధన, అభివృద్ధి విధానాలను పరిశీలించింది. అయితే ప్రస్తుతం మనుషులే నిర్ణయాలు తీసుకుంటున్నారని, AI ప్రధానంగా సహాయకుడిగా పనిచేస్తోందని నివేదిక స్పష్టం చేసింది.
Details
ఉద్యోగుల ఉత్పాదకతలో ఏకంగా 12 రెట్లు పెరుగుదల
ఈ నివేదికలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఉద్యోగుల ఉత్పాదకతకు సంబంధించినదే.
Anthropicలో అత్యంత శక్తివంతమైన అంతర్గత AI మోడల్‌ను ఉపయోగించిన ఉద్యోగులు, AI సహాయం లేకుండా పనిచేసిన దానికంటే సగటున 12 రెట్లు ఎక్కువ ఉత్పాదకత సాధిస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు.
కొన్ని నెలల క్రితం నమోదైన స్థాయితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. అంతేకాదు, AI మోడళ్ల సామర్థ్యం గత ఏడాదితో పోలిస్తే సుమారు 1.9 రెట్లు వేగంగా పెరుగుతోందని METR గుర్తించింది.
ఈ వేగానికి శిక్షణ కోసం పెంచిన కంప్యూటింగ్ శక్తి ప్రధాన కారణం కాదని పరిశోధకులు చెబుతున్నారు. AI వినియోగమే ఈ వేగానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.
Details
రహస్య మోడళ్లు.. భద్రతపై కొత్త ప్రశ్నలు
ఈ వేగం వెనుక Anthropic గత ఆరు నెలల్లో అభివృద్ధి చేసిన ఇంకా విడుదల కాని అంతర్గత AI మోడళ్లు ఉన్నట్లు నివేదిక తెలిపింది.
వాటికి Model 2, Model 3, Model 4 అనే కోడ్ పేర్లు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు AI తన తర్వాతి తరాన్ని తానే రూపొందించుకునే స్థాయిని Recursive Self-Improvement (RSI) అంటారు.
ప్రస్తుతం Anthropic ఆ స్థాయికి చేరిందని నివేదిక చెప్పడం లేదు. కానీ భవిష్యత్తులో మానవ సహాయం లేకుండానే AI తన సామర్థ్యాలను పెంచుకుంటే భద్రతా నియమాలు సరిపోతాయా అనే ప్రశ్న మాత్రం ముందుకొస్తోంది.
నివేదికలోని చాలా కీలక సమాచారాన్ని Anthropic తొలగించడంతో ఈ చర్చ మరింత పెరిగింది.