Loading...
Claude AI Sabotage: క్లాడ్‌ పై వస్తున్న ఆరోపణలకు ఆంత్రోపిక్‌ క్లారిటీ
క్లాడ్‌ పై వస్తున్న ఆరోపణలకు ఆంత్రోపిక్‌ క్లారిటీ

Claude AI Sabotage: క్లాడ్‌ పై వస్తున్న ఆరోపణలకు ఆంత్రోపిక్‌ క్లారిటీ

వ్రాసిన వారు Balachander Sharma
Nov 29, 2026
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చాట్‌బాట్‌ క్లాడ్‌ కొన్ని పనులను కావాలనే దెబ్బతీస్తోందన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారడంతో దాని తయారీ సంస్థ ఆంత్రోపిక్‌ స్పందించింది. క్లాడ్‌ను పనులను సాబోటేజ్‌ చేసేలా శిక్షణ ఇవ్వలేదని సంస్థ కమ్యూనికేషన్స్‌ టీమ్‌ సభ్యుడు ఎడ్విన్‌ అర్బస్‌ స్పష్టం చేశారు. క్లాడ్‌ కొన్ని సందర్భాల్లో తప్పులు చేయొచ్చని, ఇతర ఏఐ ఏజెంట్లు వాటిని గుర్తించవచ్చని అంగీకరించినా.. దాన్ని కావాలనే పనిని నాశనం చేయడంగా చూడకూడదని తెలిపారు. ఏఐ ప్రవర్తనపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ మరిన్ని వివరాలు పంచుకోవాలని ఆయన సంబంధిత వ్యక్తులను కోరారు.

Details

'DoNotSabotage' స్కిల్‌ ఎందుకు?

ఈ వివాదం మొదలైన తర్వాత క్లాడ్‌ పనితీరుపై పలువురు యూజర్లు తమ అనుభవాలను పంచుకున్నారు.

స్టార్టప్‌ వ్యవస్థాపకుడు పియెట్రో షిరానో.. ఏఐ రీసెర్చ్‌లో క్లాడ్‌ మోడళ్లను ఉపయోగిస్తే ప్రతి దశలో పని దెబ్బతినే ప్రయత్నం చేస్తాయని ఆరోపించారు.

ఈ సమస్యను నివారించేందుకు తానే 'DoNotSabotage' అనే స్కిల్‌ను రూపొందించినట్లు చెప్పారు. మరోవైపు కొందరు యూజర్లు క్లాడ్‌ తమ స్పష్టమైన సూచనలను పట్టించుకోలేదని ఆరోపించారు.

కీపర్‌ ఏఐ వ్యవస్థాపకుడు జేక్‌ కోజ్లోస్కీ కూడా తమ మోడల్‌లో క్లాడ్‌ కొన్ని నియమాలను మౌనంగా జోడించి పనితీరును ప్రభావితం చేసిందని పేర్కొన్నారు.

Details

అసలు కారణం ఓవర్‌కాషన్‌ అంటున్న ఆంత్రోపిక్

ఈ ఆరోపణలపై ఆంత్రోపిక్‌ మరో వివరణ కూడా ఇచ్చింది. క్లాడ్‌ ఏఐ రీసెర్చ్‌కు సంబంధించిన సమాధానాలను కావాలనే తగ్గించదని అర్బస్‌ తెలిపారు.

కొన్ని విమర్శలు పాత Fable 5 system card ఆధారంగా ఉన్నాయని చెప్పారు. Fable 5.2లో ఏఐ రీసెర్చ్‌కు సంబంధించిన కొన్ని సామర్థ్యాలపై పరిమితులు ఉన్నప్పటికీ, అది రహస్యంగా పనులను సాబోటేజ్‌ చేయడం కాదని స్పష్టం చేశారు.

దీర్ఘకాలిక పనుల్లో క్లాడ్‌ తాను రూపొందించుకున్న నియమాలకు అతిగా కట్టుబడి ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో 'ఓవర్‌కాషన్‌' ప్రవర్తన కనిపించవచ్చని వివరించారు.

దీంతో ఇది కావాలనే సాబోటేజ్‌నా, లేక ఏఐ అతిజాగ్రత్త ప్రవర్తనా అనే చర్చ కొనసాగుతోంది.

ADVERTISEMENT