Loading...
Anthropic: Claude వాటర్‌మార్కింగ్‌పై మరిన్ని వివరాలు వెల్లడించిన Anthropic
Claude వాటర్‌మార్కింగ్‌పై మరిన్ని వివరాలు వెల్లడించిన Anthropic

Anthropic: Claude వాటర్‌మార్కింగ్‌పై మరిన్ని వివరాలు వెల్లడించిన Anthropic

వ్రాసిన వారు Moogati Shabari
Aug 16, 2026
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చాట్‌బాట్ Claude రూపొందించే టెక్స్ట్‌కు వాటర్‌మార్క్ ఎలా జోడించనుందనే విషయంపై Anthropic మరిన్ని వివరాలను వెల్లడించింది. వాటర్‌మార్కింగ్ విధానం ఎలా పనిచేస్తుంది? టెక్స్ట్‌ను ఎడిట్ చేస్తే వాటర్‌మార్క్‌ను తొలగించవచ్చా? కోడ్‌కు కూడా ఇదే విధానం వర్తిస్తుందా? వంటి ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సంస్థ శుక్రవారం ఒక బ్లాగ్ పోస్టును ప్రచురించింది. Claudeలో వాటర్‌మార్కింగ్‌ను ప్రవేశపెడతామని Anthropic ఈ వారం ప్రారంభంలో ప్రకటించినప్పటి నుంచి ఆ నిర్ణయంపై వినియోగదారుల్లో చర్చ మొదలైంది. యూరోపియన్ యూనియన్ (EU) AI చట్టంలోని పారదర్శకత నిబంధనలను పాటించేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు సంస్థ తెలిపింది.

వివరాలు

ఏఐ ద్వారా కంటెంట్..

AI ద్వారా రూపొందించిన కంటెంట్‌ను గుర్తించే అవకాశం కల్పించే వ్యవస్థలను AI కంపెనీలు ఉపయోగించాలని EU AI Actలోని Transparency Code సూచిస్తుంది.

ఈ నిర్ణయంపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉదాహరణకు Redditలో ఒక వినియోగదారు ఈ చర్యను అమాయక Claude వినియోగదారులపై జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు.

మరో వినియోగదారు మాత్రం ''ప్రజలకు అబద్ధం చెప్పాలనుకోకపోతే దీనిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు'' అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరోవైపు, Business Insider కథనం ప్రకారం.. Xలో ''డజన్ల కొద్దీ'' మంది వినియోగదారులు ఈ నిర్ణయానికి నిరసనగా తమ Claude సబ్‌స్క్రిప్షన్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

వివరాలు

వాటర్‌మార్క్ ఎలా పనిచేస్తుంది?

Anthropic తన తాజా బ్లాగ్ పోస్టులో ముందుగా వాటర్‌మార్కింగ్ విధానం గురించి సాధారణ వివరణ ఇచ్చింది.

వాతావరణాన్ని వివరించేటప్పుడు 'overcast' అనే పదాన్ని ఉపయోగించాలా, 'grey' అనే పదాన్ని ఉపయోగించాలా అన్నట్లుగా పెద్దగా ప్రాధాన్యం లేని చిన్నచిన్న పద ఎంపికలు చేసే సందర్భాల్లో Claude తన సమాధానాల్లో ఒక ప్రత్యేక నమూనాను రూపొందించగలదని సంస్థ తెలిపింది.

ఈ నమూనా సాధారణ పాఠకుడికి ఏమాత్రం కనిపించదని, అయితే దానిని గుర్తించేందుకు అవసరమైన ప్రత్యేక 'కీ' ఉన్న వ్యక్తులు మాత్రం దాన్ని గుర్తించగలరని Anthropic వివరించింది.

వాటర్‌మార్కింగ్ వల్ల Claude అందించే సమాధానాల నాణ్యతపై ఎలాంటి ప్రభావం ఉండదని సంస్థ స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు

కోడ్‌కు వాటర్‌మార్క్ తక్కువగా ఉండొచ్చు..

సాధారణ టెక్స్ట్‌తో పోలిస్తే ప్రోగ్రామింగ్ కోడ్‌లో వాటర్‌మార్క్ ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని Anthropic తెలిపింది.

దీనికి ప్రధాన కారణం కోడ్ విషయంలో మోడల్‌కు పదాల ఎంపికలో అంత స్వేచ్ఛ ఉండకపోవడమే.

కోడ్ తప్పనిసరిగా పనిచేసే విధంగా ఉండాలి. ఒకే సమస్యను పరిష్కరించేందుకు సమానంగా సరైన అనేక పదాలు లేదా నిర్మాణాలను ఎంచుకునే అవకాశం సాధారణ రచనలో ఉన్నంతగా కోడ్‌లో ఉండదు.

అందువల్ల సాధారణ టెక్స్ట్‌లో మాదిరిగా వివిధ సమానమైన ఎంపికల మధ్య Claudeకు స్వేచ్ఛగా ఎంచుకునే అవకాశం కోడ్‌లో తక్కువగా ఉంటుంది.

ఈ కారణంగానే ఇతర రకాల టెక్స్ట్‌తో పోలిస్తే కోడ్‌లో వాటర్‌మార్క్ తక్కువగా ఉండే అవకాశం ఉందని Anthropic వివరించింది.

ADVERTISEMENT