Page Loader
Apple Event 2023: నేడే ఆపిల్ ఈవెంట్.. కాసేపట్లో ఐఫోన్ 15 సిరీస్ లాంచ్!
నేడే ఆపిల్ ఈవెంట్.. కాసేపట్లో ఐఫోన్ 15 సిరీస్ లాంచ్!

Apple Event 2023: నేడే ఆపిల్ ఈవెంట్.. కాసేపట్లో ఐఫోన్ 15 సిరీస్ లాంచ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2023
06:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'వండర్ లస్ట్' ఈవెంట్ నేడు జరగనుంది. ఈ ఈవెంట్‌లో ఐ ఫోన్ 15 సిరీస్ తో పాటు ఇతర గ్యాడ్జెట్స్ కూడా లాంచ్ కానున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30గంటలకు కాలిఫోర్నియాలో ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. USB-Cతో కూడిన AirPods ప్రో తో స్మార్ట్ ఫోన్ వాచ్ లు, యాపిల్ వాచ్ లు, ఓఎస్ అప్ డేట్స్ కు సంబంధించిన ప్రకటనలు ఈ వేదికగా వెలువడే అవకాశం ఉంది. తాజాగా ట్విట్టర్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఐ ఫోన్ లవర్స్ కోసం మ‌రో కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నాడు. లైక్ చేసే బ‌ట‌న్ ను మారుస్తున్నట్లు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయన ప్రకటించాడు

Details

ఐఫోన్​ 16 సిరీస్​పై అప్డేట్​..?

ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను ఈ వేదికగా యాపిల్‌ విడుదల చేయనుంది. ఈ సారి లైటనింగ్‌ పోర్ట్‌ బదులుగా ఈయూ కామన్‌ ఛార్జర్‌ నిబంధనలకు అనుగుణంగా యూఎస్‌బీ టైప్‌-సి పోర్టుతో ఈ ఫోన్లు రానున్నట్లు సమాచారం. సాధారణంగా ఆపిల్ ఈవెంట్ వస్తోందంటే అప్పుడు లాంచ్ చేసే ఐఫోన్ సిరీస్ తో పాటు ఆ తర్వాత వచ్చే సిరీస్ పైనా ఆసక్తి నెలకుంటుంది. ఈ తరుణంలో ఐఫోన్ 16 సిరీస్ పైనా బజ్ నెలకొంది. ఆపిల్ వాచ్ సిరీస్ 9, ఆపిల్ వాచ్ అల్ట్రా, ఎయిర్ బడ్స్, ఎయిర్ బడ్స్ మాక్స్ ఈ ఈవెంట్ లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.