
Google: ఆపిల్-గూగుల్-ఫేస్బుక్ డేటా లీక్! 18.4 కోట్ల పాస్వర్డ్లు లీక్?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఆన్లైన్ సేవల నుంచి కోట్లాదిగా పాస్వర్డ్లు, సున్నితమైన సమాచారం లీక్ అయినట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణుడు జెరెమియా ఫౌలర్ వెల్లడించారు.
ఆపిల్, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ లాంటి ప్రముఖ సంస్థలకు సంబంధించిన 18.4 కోట్లకు పైగా పాస్వర్డ్లు ఈ లీక్‌లో ఉన్నాయని తెలిపారు.
అంతేకాదు లాగిన్ వివరాలు, ఇమెయిల్ చిరునామాలు, ఆథరైజేషన్ లింక్‌లు వంటి ఇతర గోప్యమైన సమాచారమూ ఇందులో భాగంగా ఉన్నట్లు చెప్పారు.
Details
పాస్‌వర్డ్‌లతో పాటు ఇతర డేటా కూడా
లీక్ అయిన డేటా కేవలం పాస్వర్డ్లకే పరిమితం కాకుండా.. బ్యాంకింగ్, ఆరోగ్య, ప్రభుత్వ సేవల లాగిన్ వివరాలు కూడా ఇందులో ఉన్నట్లు తెలిపారు.
ఈ డేటా సాధారణ డేటాబేస్‌ల మాదిరిగా ఎన్‌క్రిప్ట్ చేయకుండానే, ప్లెయిన్ టెక్స్ట్ రూపంలో నిల్వ చేయబడిందని ఫౌలర్ పేర్కొన్నారు.
ఈ డేటా ఇంటర్నెట్లో సులభంగా అందుబాటులో ఉండటమే పెద్ద ప్రమాదమని హెచ్చరించారు.
Details
మాల్వేర్ ద్వారా డేటా దొంగతనమా?
ఈ లీక్ వెనుక ఇన్ఫోస్టీలింగ్ మాల్వేర్ ఉండవచ్చని భావిస్తున్నారు.
లుమా స్టెల్లర్ లాంటి ప్రమాదకరమైన సాఫ్ట్వేర్లు సెక్యూరిటీ లేని కంప్యూటర్ల నుంచి పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ వివరాలు, వ్యక్తిగత సమాచారం దొంగిలిస్తాయని ఫౌలర్ వివరించారు.
ఇలా సేకరించిన డేటాను డార్క్ వెబ్‌లో విక్రయించడంతో, సైబర్ నేరగాళ్లకు అది చేరే అవకాశముందని చెప్పారు.
హోస్టింగ్ కంపెనీ స్పందన
ఈ అసురక్షిత డేటాబేస్‌ను గుర్తించిన వెంటనే ఫౌలర్.. దానిని హోస్ట్ చేస్తున్న కంపెనీకి సమాచారం అందించారు. హోస్టింగ్ ప్రొవైడర్ వెంటనే ఆ ఫైల్‌ను ఆన్లైన్ నుంచి తొలగించిందని తెలిపారు.
అయితే అప్పటికే ఆ డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చేరిన అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఆయన పేర్కొన్నారు.
Details
నిజమేనని బాధితులే ధృవీకరించారు
డేటాబేస్‌లో కనిపించిన కొందరిని ఫౌలర్ సంప్రదించగా.. తమ ఖాతా వివరాలు నిజంగానే బహిర్గతమైనట్లు వారు ధృవీకరించారు. దీంతో ఈ లీక్ ప్రామాణికతపై స్పష్టత వచ్చింది.
ఒకే పాస్‌వర్డ్‌ను వాడొద్దు
అన్ని ఖాతాల్లో ఒకే యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను వాడే వినియోగదారులు అత్యధికంగా ప్రమాదంలో ఉంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక ఖాతా హ్యాక్ అయితే, అదే వివరాలతో మిగతా సేవలను కూడా నేరగాళ్లు యాక్సెస్ చేసే ప్రమాదం ఉందని అన్నారు. ఇది ఆర్థిక మోసాలకు దారి తీసే అవకాశముంది.
Details
బలమైన పాస్వర్డ్లు, మల్టీ ఫ్యాక్టర్ అవసరం
సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే.. వినియోగదారులు బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను వాడాలని, వాటిని తరచుగా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు.
మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వాడితే అదనపు భద్రత లభిస్తుంది. ఇక, గూగుల్ లాంటి సంస్థలు ఉచితంగా అందిస్తున్న టూల్స్ ద్వారా తమ డేటా లీక్ అయిందో లేదో తనిఖీ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
డేటా లీక్ ప్రమాదాలను తక్కువ చేయాలంటే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి, భద్రతా చర్యలను పటిష్టం చేయాలి.