ఆపిల్: ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్ బాగా వేడెక్కుతున్నాయని కస్టమర్ల కంప్లయింట్
ఆపిల్ నుండి ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ మొబైల్స్ కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సిరీస్ ఫోన్లను కొనడానికి ఆపిల్ స్టోర్లకు వద్ద జనాలు ఎగబడటం ఇంటర్నెట్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఆపిల్ 15 సిరీస్ మోడల్స్ కొన్న యూజర్లు కొంతమంది చార్జింగ్ విషయంలో కంప్లైంట్ చేస్తున్నారట. అలాగే హీటింగ్ సమస్య కూడా ఉందని అంటున్నారట. ఆపిల్ 15 సిరీస్ మొబైల్స్ లో చార్జింగ్ చాలా తొందరగా తగ్గిపోతుందని కంప్లైంట్ చేస్తున్నారట.
ఆపిల్ సపోర్ట్ టీమ్ తెలియజేస్తున్న పరిష్కారం
గేమ్ ఆడినా, చార్జింగ్ పెట్టిన బాగా వేడెక్కుతుందని, ముట్టుకోవడానికి వీలు లేనంతగా వేడిగా మారుతుందని మరికొంత మంది యూజర్ల నుండి కంప్లయింట్స్ వెళ్ళాయట. ఫస్ట్ టైమ్ సెట్టింగ్ చేస్తునప్పుడు హీటింగ్ సమస్య ఎదురవుతుందనీ, ఆ తర్వాత అలాంటి సమస్య ఏర్పడే అవకాశమే లేదనీ ఆపిల్ సపోర్ట్ టీమ్ వెల్లడి చేస్తోంది. ఆపిల్ నుండి ఏ డివైజ్ లాంచ్ అయినా అది వందశాతం టెస్టులు జరిగిన తర్వాతే లాంచ్ అవుతుందనీ, డివైజును అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాతే మార్కెట్లోకి తీసుకువస్తుందనీ, అందువల్ల హీట్, ఛార్జింగ్ సమస గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని కొందరు నిపుణులు తెలియజేస్తున్నారు.