Loading...
Apple: AI ఎక్కువగా వాడేవారికి ఆపిల్ కొత్త చెల్లింపు ప్లాన్ సిద్ధం?
AI ఎక్కువగా వాడేవారికి ఆపిల్ కొత్త చెల్లింపు ప్లాన్ సిద్ధం?

Apple: AI ఎక్కువగా వాడేవారికి ఆపిల్ కొత్త చెల్లింపు ప్లాన్ సిద్ధం?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2026
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధస్సు (AI) సేవలను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం ఆపిల్ కొత్త చెల్లింపు ప్లాన్‌ను తీసుకురావచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. సంస్థ సీఈఓ టిమ్ కుక్ తాజా ఆర్థిక ఫలితాల సమావేశంలో ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో Apple Intelligence, కొత్త Siri AI ఫీచర్లను వినియోగదారులు భారీగా ఉపయోగిస్తారని భావిస్తున్నామని ఆయన చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని iCloud Plusలో అదనపు అప్‌గ్రేడ్ అవకాశాలను కల్పించే దిశగా సంస్థ ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. అంటే, ఎక్కువ AI సేవలు కావాలనుకునే వారు అదనపు చార్జీ చెల్లించి ప్రత్యేక ప్లాన్‌ను ఎంచుకునే అవకాశం ఉండొచ్చు.

వివరాలు 

ఈ ఏడాది చివర్లో iOS 27తో పాటు Siri AI విడుదల

ఈ ఏడాది చివర్లో iOS 27తో పాటు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న Siri AIను ఆపిల్ విడుదల చేయనుంది.

కొత్త Siri AI ద్వారా ఫోన్ స్క్రీన్‌పై కనిపించే సమాచారానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా, వివిధ యాప్‌ల మధ్య పనులను కూడా నిర్వహించగలదు.

అలాగే ChatGPT తరహాలో ప్రత్యేక ఇంటర్‌ఫేస్‌తో పనిచేసే Siri AI యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

ఇప్పటికే జూన్‌లో ఆపిల్ తన AI ఫీచర్లకు రోజువారీ వినియోగ పరిమితులు ఉంటాయని ప్రకటించింది.

ముఖ్యంగా ఇమేజ్ జనరేషన్ వంటి సేవలు అధిక సామర్థ్యం గల సర్వర్ మోడళ్లపై ఆధారపడటంతో ఈ పరిమితులను అమలు చేస్తున్నట్లు తెలిపింది.

వివరాలు 

AIను ఎక్కువగా వినియోగించే వినియోగదారుల కోసం ప్రత్యేక చెల్లింపు టియర్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు

అదే సమయంలో iCloud Plusలోని చాలా ప్లాన్‌ల ద్వారా AI సేవలకు మరింత విస్తృత యాక్సెస్ అందుబాటులో ఉంటుందని కూడా పేర్కొంది.

అయితే ఇప్పుడు AIను ఎక్కువగా వినియోగించే వినియోగదారుల కోసం ప్రత్యేక చెల్లింపు టియర్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో సాధారణ వినియోగదారులకు ఒక స్థాయి సేవలు, అధిక వినియోగం కోరుకునే వారికి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అందించే విధానాన్ని యాపిల్ అమలు చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

30.74 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసిన ఆపిల్ సర్వీసెస్ విభాగం

ఇదిలా ఉండగా, iCloud Plus, Apple TV, Apple One వంటి సబ్‌స్క్రిప్షన్ సేవలు ఉన్న ఆపిల్ సర్వీసెస్ విభాగం గత కొన్ని నెలల్లో 30.74 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

సబ్‌స్క్రిప్షన్ ఆధారిత సేవలకు పెరుగుతున్న ఆదరణను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

AI సేవల కోసం కొత్త చెల్లింపు ప్లాన్‌ను ప్రవేశపెడితే సంస్థ ఆదాయం మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT