LOADING...
Apple: ఆపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్-2026 రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. విజేతలకు బహుమతులు
విజేతలకు బహుమతులు

Apple: ఆపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్-2026 రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. విజేతలకు బహుమతులు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2026
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ సంస్థ విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే Swift Student Challenge 2026 దరఖాస్తులను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు తమ కోడింగ్ నైపుణ్యాలను చూపించి, యాప్‌ల రూపంలో సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది Apple. దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే మొదలై ఫిబ్రవరి 28తో ముగియనుంది. ఇందులో పాల్గొనే విద్యార్థులు ఫుల్‌టైమ్ ప్రొఫెషనల్ డెవలపర్లుగా పనిచేస్తుండకూడదు,అలాగే ఆయా దేశాల కనీస వయస్సు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. భారత్, అమెరికాల్లో కనీస వయస్సు 13 ఏళ్లు కాగా, చైనా, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, కొన్ని యూరోప్ దేశాల్లో 14 ఏళ్లు ఉండాలి.

వివరాలు 

వీటి ఆధారంగా విజేతల ఎంపిక

దరఖాస్తు చేసుకునే వారు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్య లేదా ప్రపంచ స్థాయి సామాజిక అంశంపై ఆధారపడి,మూడు నిమిషాల్లో అనుభవించగలిగేలా ఒక యాప్ ప్లేగ్రౌండ్ రూపొందించాలి. ఈ యాప్‌లు Swift Playgrounds 4.6 లేదా Xcode 26 లేదా అంతకన్నా కొత్త వెర్షన్లలో రూపొందించి, ఆఫ్‌లైన్‌లో పనిచేసేలా ఉండాలి. ఇన్నోవేషన్,క్రియేటివిటీ, సమానత్వం,సామాజిక ప్రభావం ఆధారంగా ఆపిల్ విజేతలను ఎంపిక చేస్తుంది. విజేతలకు అధికారిక గుర్తింపు లభించడమే కాకుండా, ప్రత్యేకంగా ఎంపికైన 'డిస్టింగ్విష్డ్ విన్నర్స్'ను అమెరికాలోని కుపర్టినోలో ఉన్న Apple Parkకు మూడు రోజుల పర్యటనకు ఆహ్వానిస్తారు. ఈ పర్యటనకు సంబంధించిన ప్రయాణ, వసతి ఖర్చులను ఆపిల్ భరిస్తుంది. అక్కడ విద్యార్థులు ఆపిల్ ఇంజినీర్లను కలుసుకుని, ఇతర విద్యార్థులతో కలిసి నేర్చుకునే అనుభవాల్లో పాల్గొననున్నారు.

Advertisement