iPhone Gray List: ఐఫోన్ కీబోర్డ్ వెనుక మరో రహస్యం.. గ్రే లిస్ట్‌లో 4500 పదాలు
ఈ వార్తాకథనం ఏంటి
పరిశోధకుడు డెరిక్ కాఫ్‌మన్ తన ఐఫోన్‌లో కొన్ని పదాలు టైప్ చేసినప్పుడు కీబోర్డ్ వాటిని ఎందుకు సూచించడం లేదనే విషయాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో 4,500కు పైగా పదాలు, పదబంధాలతో కూడిన జాబితాను గుర్తించారు. సాధారణంగా మనం తరచూ ఉపయోగించే పదాలను కూడా ఐఓఎస్ ప్రిడిక్టివ్ టెక్స్ట్ సూచించకపోవచ్చని ఆయన వివరించారు. అంటే ఒక పదాన్ని ఎన్నిసార్లు ఉపయోగించినా, తర్వాత టైప్ చేయాల్సిన పదంగా కీబోర్డ్ దాన్ని చూపించకపోవచ్చు. ఈ పరిశోధనలో OpenAI Codex, Anthropic Claude Code టూల్స్‌ను ఉపయోగించారు.
Details
అభ్యంతరకర పదాలే కాదు.. రాజకీయ అంశాలకూ చోటు
ఈ జాబితాలో అసభ్య పదాలు, అవమానకర వ్యాఖ్యలతో పాటు రాజకీయంగా సున్నితమైన పదబంధాలు కూడా ఉన్నట్లు పరిశోధకుడు గుర్తించారు.
ఉదాహరణకు 'Son of a bitch', 'Tibetan independence', 'United Ireland' వంటి పదాలు ఉన్నాయి.
అంతేకాదు, హీబ్రూ, అరబిక్, చైనీస్ భాషల్లోని కొన్ని రాజకీయ పదబంధాలు కూడా ఈ జాబితాలో కనిపించాయి.
'Dictator Trump', 'Sleepy Joe' వంటి పదాలు సైతం ఇందులో ఉన్నట్లు వెల్లడైంది.
Details
ఆపిల్ ఏమంటోంది?
ఈ పరిశోధనపై స్పందించిన ఆపిల్.. అభ్యంతరకరమైన లేదా అనుచితమైన పదాలను కీబోర్డ్ సూచించకుండా తమ సిస్టమ్‌ను రూపొందించినట్లు తెలిపింది.
అయితే కొన్ని ప్రత్యేక పదబంధాలను ఈ జాబితాలో ఎందుకు చేర్చారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. వినియోగదారులు తమకు నచ్చిన పదాలను టైప్ చేయవచ్చని, కీబోర్డ్ సూచనలను పక్కన పెట్టి ముందుకు వెళ్లవచ్చని పేర్కొంది.
Details
వినియోగదారుల ఆలోచనలపై ప్రభావం ఉంటుందా?
కాఫ్‌మన్ అభిప్రాయం ప్రకారం, ఇలాంటి జాబితాలు వినియోగదారుల కమ్యూనికేషన్ విధానాన్ని పరోక్షంగా ప్రభావితం చేయవచ్చు.
దీన్ని ఆయన స్వల్పస్థాయి సెన్సార్‌షిప్‌గా అభివర్ణించారు. అయితే కోట్లాది మంది ఉపయోగించే యాపిల్ కీబోర్డ్‌లో చిన్న మార్పు కూడా పెద్ద ప్రభావం చూపవచ్చు.
అందుకే టెక్నాలజీ సంస్థలు సౌలభ్యంతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.