NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Apple iPhone SE 4: వచ్చే వారమే ఐఫోన్‌ ఎస్‌ఈ 4 విడుదల 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Apple iPhone SE 4: వచ్చే వారమే ఐఫోన్‌ ఎస్‌ఈ 4 విడుదల 
    వచ్చే వారమే ఐఫోన్‌ ఎస్‌ఈ 4 విడుదల

    Apple iPhone SE 4: వచ్చే వారమే ఐఫోన్‌ ఎస్‌ఈ 4 విడుదల 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 07, 2025
    03:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సాధారణంగా ఐఫోన్‌లు ఖరీదైనవే. భారీ ఖర్చు పెట్టి కొనలేనివారికి ఆపిల్ ప్రత్యేకంగా ఎస్‌ఈ (SE) మోడళ్లను అందిస్తోంది.

    2016 నుంచి 2020, 2022 వరకు మూడు ఎస్‌ఈ మోడళ్లను విడుదల చేసింది.

    ఇప్పుడు నాలుగో తరం ఐఫోన్‌ ఎస్‌ఈ (iPhone SE 4) మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోందని 'బ్లూమ్‌బెర్గ్‌' పేర్కొంది.

    వచ్చే వారంలోనే దీని లాంచ్‌ ఉండొచ్చని, ఈ నెలాఖరులో విక్రయాలు ప్రారంభం కానున్నాయని సమాచారం.

    వివరాలు 

    వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి..

    2022లో ఆపిల్ ఐఫోన్‌ ఎస్‌ఈ 3ను విడుదల చేసింది. 'పీక్‌ పర్ఫార్మెన్స్‌' ఈవెంట్‌లో దీన్ని పరిచయం చేసింది.

    అయితే తాజా ఎస్‌ఈ 4ను ప్రత్యేక ఈవెంట్‌ నిర్వహించకుండా, నేరుగా వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది.

    అమెరికాతో పాటు భారత్‌లోనూ ఈ ఫోన్‌ ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్లు సమాచారం.

    గత ఎస్‌ఈ మోడల్‌ను ఆపిల్ ₹43,900కి విడుదల చేసింది. అయితే కొత్త ఎస్‌ఈ 4 ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    వివరాలు 

    ఎస్‌ఈ 4 మోడల్‌ ఐఫోన్‌ 14ను పోలి ఉండేలా డిజైన్‌

    ఫీచర్ల విషయానికొస్తే, కొత్త ఐఫోన్‌ ఎస్‌ఈ 4 మోడల్‌ ఐఫోన్‌ 14ను పోలి ఉండేలా డిజైన్‌ చేయబడింది.

    అంటే, ఇందులో హోమ్‌ బటన్‌, టచ్‌ ఐడీ లేకుండా.. గెశ్చర్‌ నావిగేషన్‌, ఫేస్‌ ఐడీ అందుబాటులోకి రానున్నాయి.

    అలాగే, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌తో పాటు, యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను కలిగి ఉంటుంది.

    ఇందులో ఐఫోన్‌ 16లో వాడిన ఏ18 చిప్‌ ఉండొచ్చని సమాచారం. 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో రావడంతో, 4.7 అంగుళాల ఎస్‌ఈ 3తో పోలిస్తే ఈ ఫోన్‌ కొంత పెద్దగా ఉంటుంది.

    దీని అధికారిక విడుదల తర్వాత మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపిల్

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    ఆపిల్

    Brain chip: బ్రెయిన్ చిప్ విజన్ ప్రోని ఆలోచనలతో నియంత్రించడానికి అనుమతిస్తుంది టెక్నాలజీ
    Apple: విక్రయాల వృద్ధిలో 'ఆపిల్' సంచలన రికార్డు.  వ్యాపారం
    Foldable iPhone: ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ అయ్యేది ఎప్పుడంటే! టెక్నాలజీ
    Apple: ఆపిల్ ఐఫోన్ వినియోగదారులకు AI ఫీచర్లను ఉచితంగా అందించదు.. ఛార్జీ ఎంతంటే..? టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025