LOADING...
Apple Games: ఆపిల్‌ నుంచి కొత్త గేమింగ్ యాప్ ఆవిష్కరణ.. 'ఆల్-ఇన్-వన్' ప్లాట్‌ఫారంగా మారే అవకాశం!
ఆపిల్‌ నుంచి కొత్త గేమింగ్ యాప్ ఆవిష్కరణ.. 'ఆల్-ఇన్-వన్' ప్లాట్‌ఫారంగా మారే అవకాశం!

Apple Games: ఆపిల్‌ నుంచి కొత్త గేమింగ్ యాప్ ఆవిష్కరణ.. 'ఆల్-ఇన్-వన్' ప్లాట్‌ఫారంగా మారే అవకాశం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2025
01:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్‌ తన గేమింగ్ ప్రపంచాన్ని విస్తరించే దిశగా కీలక ముందడుగు వేసింది. తాజాగా "Apple Games" అనే ప్రత్యేక గేమింగ్ యాప్‌ను అధికారికంగా ప్రకటించింది. యాపిల్ డివైస్‌లలో గేమింగ్ అనుభవాన్ని ఒకే చోటకి తెచ్చేలా రూపొందించిన ఈ యాప్‌ గేమర్లకు లీడర్‌బోర్డ్లు, అచీవ్‌మెంట్లు, ఫ్రెండ్స్ స్కోర్లు, ఇంకా బహుళ సామాజిక ఫీచర్లను అందిస్తోంది. 'Apple Games' యాప్‌ ఫీచర్లు ఏంటి? ఈ యాప్‌ను యూజర్లు గేమ్ లాంచర్‌లా ఉపయోగించొచ్చు. మీ గేమ్‌ల లైబ్రరీ, ఆర్కేడ్‌, ఫ్రెండ్స్ లిస్ట్, అలాగే ఆప్‌స్టోర్ సిఫార్సులన్నింటినీ ఒకే ప్లాట్‌ఫారంలో పొందుపరిచారు.

Details

గేమ్స్ యాప్‌లో ఐదు ట్యాబ్స్

Home Arcade Play Together Library Search 'Play Together' - ఫ్రెండ్స్‌తో కలసి గేమింగ్‌ ఈ ఫీచర్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ ఏ గేమ్ ఆడుతున్నారో చూడొచ్చు, వారితో స్కోర్లు పంచుకోవచ్చు. ఆట కోసం ఆహ్వానించవచ్చు. గేమింగ్‌లో సామాజిక అనుభూతిని పెంచే విధంగా దీన్ని రూపొందించారు. స్కోర్ పోటీలు, మరింత మజా యాప్‌లో 'Challenges' ఫీచర్ ద్వారా స్కోర్ ఆధారంగా మిత్రులతో పోటీ పడొచ్చు. డెవలపర్లు గేమ్ సెంటర్ లీడర్‌బోర్డ్ ఆధారంగా ఒక్కొక సింగిల్ ప్లేయర్ గేమ్‌ను కంపిటిటివ్ గేమ్‌గా మార్చేందుకు వీలుగా ఈ ఫీచర్ రూపొందించారు.

Details

 iPads, Macs కోసం Game Overlay

iPad, Macలపై Game Overlay అనే ఫీచర్‌ను కూడా యాపిల్ పరిచయం చేసింది. ఇది గేమ్ ఆడుతున్న సమయంలో గేమ్ సెంటర్‌ ఫీచర్లు, ఫ్రెండ్స్ లిస్ట్, సెట్టింగ్స్‌ను అప్లికేషన్‌ను మినిమైజ్ చేయకుండానే యాక్సెస్ చేసే సౌలభ్యం ఇస్తుంది.

Details

యాపిల్ గేమింగ్ ఎకోసిస్టమ్‌లో కొత్త అధ్యాయం

ఈ కొత్త యాప్‌తో యాపిల్ గేమింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఇప్పటికే macOS Sonomaలో Game Mode, తరువాత iOS 18లో అదే ఫీచర్‌ను తీసుకొచ్చిన యాపిల్, ఇప్పుడు AAA గేమ్స్ (Death Stranding, Assassin's Creed Mirage) వంటి బడా టైటిల్స్‌ను తన ప్లాట్‌ఫాంలకు తీసుకురావడంలో నిమగ్నమై ఉంది. ఈ యాప్‌ ద్వారా యాపిల్‌ గేమింగ్ ప్రపంచాన్ని మరింత సమగ్రంగా, వినోదాత్మకంగా మలచే దిశగా అడుగులు వేస్తోంది. గేమింగ్‌లో సామాజిక అనుభవం, పోటీ స్పూర్తి, సులభమైన యాక్సెస్‌ అన్నీ ఒకే చోట లభించబోతున్నాయి.